లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

International

20ఏళ్లు జైలుశిక్ష అనుభవించాక నిర్ధోషని తేల్చిన కోర్టు ! నా జీవితాన్ని తెచ్చివ్వగలరా?బాధితుడి ఆవేదన

Published

on

south korea man sentenced to 20 years in prison for a crime he did not commit now acquitted : చేయని పనికి చిన్న మాట అంటేనే భరించలేం. అటువంటిది ఓ వ్యక్తి చేయని నేరానికి ఏకంగా 20ఏళ్ల కఠినజైలుశిక్షను అనుభవించాడు. దీంతో అని జీవితంలో అత్యంత విలువైనకాలం కాస్తా జైలులో పోలీసులు పెట్టే చిత్రహింసలకు బలైపోయింది. అలా 20ఏళ్ల తరువాత అను నిర్ధోషి అని కోర్టు చెప్పటంతో అతన్ని విడుదల చేశారు. దక్షిణకొరియాకు చెందిన యూన్ సియాంగ్​ యె అనే వ్యక్తి అత్యంత ధీనగాథ ఇది.

దక్షిణకొరియాకు చెందిన 53 ఏళ్ల యూన్ సియాంగ్​ యె 13ఏళ్ల అమ్మాయిని అత్యాచారం చేసి హత్య చేశాడనే ఆరోపణలతో 1988లో అరెస్ట్ అయ్యాడు. హై ప్రొఫైల్ కేసు అయిన వాసియాంగ్ మర్డర్లలో ఒకటైన ఆ హత్యను యూన్ సియోంగ్ యో చేశాడని నమ్మిన పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.

ఆ కేసుకు సంబంధించి 10మంది నిందితులు కాలక్రమంలో చనిపోయారు. కానీ పోలీసులు సియాంగ్​ ను మాత్రమే పట్టుకున్నారు. అనంతరం సుదీర్ఘ విచారణ తర్వాత అతనికి 1989లో యావజ్జీవ శిక్ష పడింది. అయితే ఆ 13 ఏళ్ల అమ్మాయిపై అత్యాచారం, హత్యకు సియాంగ్ ఎటువంటి సంబంధం లేదని దక్షిణ కొరియాలోని కోర్టు తాజాగీ తేల్చింది. దీంతో ఏ నేరం చేయకుండానే యూన్ సియాంగ్ 20 ఏళ్లు జైల్లో అత్యంత కఠినకారాగార శిక్ష అనుభవించాల్సి వచ్చింది.

జైలు జీవితంలో సియాంగ్​ ను పోలీసులు దారుణం హింసించారని జడ్జికి విన్నవించుకున్నాడు. దీంతో న్యాయమూర్తి పార్ జియాంగ్ అది నిజమేనని అతని శరీరంపై అయిన గాయాలను బట్టి గుర్తించారు. కనీసం కంటినిండా నిద్ర కూడా లేకుండా దారుణ హింసలకు గురిచేశారని..అక్రమంగా నిర్బంధించారని జడ్జి అభిప్రాయపడ్డారు. విచారణ లోపం వల్ల అతడి హక్కులకు తీవ్ర భంగం వాటిల్లిందని పేర్కొన్నారు.

దీనిపై సియాంగ్ మాట్లాడుతూ..తాను అన్యాయంగా 20ఏళ్ల జైలులో మగ్గిపోవాల్సి వచ్చిందని పోలీసులు హింసలు భరించాల్సిన వచ్చిందని వాపోయాడు. తన జీవితాన్ని దుర్భరం చేశారని ఆరోపించారు. ఇప్పటికైనా తాను నిర్ధోషి అని తేలినందుకు సంతోషంగా ఉందని కానీ తన జీవింతం తిరిగి రాదని దానికి పోలీసులు చేసిన దుర్మార్గమేనని ఆవేదన వ్యక్తంచేశాడు. నా మన్సులో ఈ భారాన్ని ఇన్నేళ్లుగా మోస్తూనే ఉన్నా..ఇప్పటికీ నా మనస్సులోంచి భారాన్ని దింపుకోగలుగుతున్నానని తీర్పు అనంతరం యూన్ సియాంగ్ తెలిపాడు.ఇప్పటికైనా తాను నిర్ధోషినని విడుదల అయినందకు నవ్వాలో ఏడ్వాలో కూడా నాకు అర్థం కావట్లేదన్నాడు.

వాసియాంగ్ లో 10 సీరియల్ హత్యలు జరిగాయి. 10మంది మహిళలను దారుణంగా హత్య చేసినట్లుగా లీ చున్ జా అనే వ్యక్తి కారణమని డీఎన్​ఏ ద్వారా పోలీసులు 2019 సెప్టెంబర్​ లో గుర్తించారు. ఆ పది హత్యలు తాన చేసినట్టు లీచున్ అంగీకరించాడు. దీంతో సియాంగ్​ నిర్దోషి అని తేలింది. సియాంగ్ ఏ హత్య కేసులో అయితే నిందితుడిగా పట్టుబడ్డాడో ఆ బాలిక హత్యను కూడా లీచున్ నే చేసినట్లుగా తేలటంతో సియోంగ్ ఇన్నేళ్లకు నిర్ధోషిగా విడుదల అయ్యాడు.

ఇదిలా ఉంటే నేరం చేయకపోయినా అన్యాయంగా 20 ఏళ్లు జైలుశిక్ష అనుభవించినందుకు సియాంగ్​ కు మిలియన్ డాలర్ల నష్ట పరిహారం వస్తుందని అంచనా వేస్తున్నామని సియోంగ్ లాయర్ తెలిపారు. తన క్లైంట్ ఇన్నాళ్లు కోల్పోయిన జీవితానికి ఆ పరిహారం ఇవ్వటం న్యామని కానీ ఆ పరిహారంతో అతని జీవితం తిరిగి రాదని కానీ అది అతని మిగిలిన జీవితాన్ని జీవించటానికి ఉపయోగపడుతుందని అన్నారు. సియోంగ్ పడిన వేదనను, కోల్పోయిన కాలాన్ని ఎవరు తిరిగి ఇస్తారని ప్రశ్నించారు.