చెట్టు కనిపిస్తే చాలు పూనకం వచ్చేస్తుంది... తల దబాదబా బాదేసుకుంటాడు

south korean man has been training by banging his head against a tree every day for five years

దక్షిణ కొరియాలోని సియోల్‌‌లో చెప్పులు కుట్టే ఓ వ్యక్తికి చెట్టు కనిపిస్తే చాలు పూనకం వచ్చేస్తుంది. గబాగబా వెళ్లిపోయి తలను చెట్టుకేసి దబా దబా బాదుకుంటాడు. అలా ఐదు సంవత్సరాల నుంచి చేస్తున్నాడు. తినడం, నిద్రపోవడమైనా మరిచిపోతాడేమో గానీ.. అతడు తలను చెట్టుకేసి కొట్టుకోవడం మాత్రం మరిచిపోడు.ఇతన్ని పేరుతో ఎవ్వరూ పిలవరు. అసలు గుర్తే పెట్టుకోరు..ఆ..ఎవరు చెట్టుకు తల బాదుకుంటాడు అతనా? అంటారు. ఆఖరికి కొరియా మీడియా కూడా అతన్ని చెట్టుకు తల కొట్టుకునేవ్యక్తా? అనే అంటుంది. 

అలాగే ఫేమస్ అయ్యాడు అతను. ఫేమస్ అవ్వాలని అలా చేయట్లేదట. అలాగని పిచ్చి పట్టీ కాదు..ఎందుకో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. అలా చెట్టుకు తల కొట్టుకుంటూ ఫేమస్ అయిన ఆ వ్యక్తిని ఇటీవల ఓ టీవీ ఇంటర్వ్యూ చేసింది. ఈ ఇంటర్వ్యూలో కూడా అతడు అలాగే చేయటంతో ఈ విషయం ప్రపంచం అంతా తెలిసింది. అతడు రోజూ తన చెప్పుల దుకాణం తెరిచే ముందు చెట్టుకు తలను బాదుకుంటాడు. 

అలా అని అతడి తలకు నొప్పి ఉండదా? అంటే అతనూ మనిషే కదా?.నొప్పి ఉంటుంది. బొప్పి కడుతుంది. అయినా సరే మానడు.అలా రోజు కొట్టుకుని కొట్టుకుంటుంటే నుదుట చర్మం నల్లగా కమిలిపోయింది. నొప్పిని సైతం భరిస్తూ అతడు తన తలను బాదుకుంటునే ఉంటాడు.

అతడు అలా చేయడాన్నిమీడియా ఈ సీక్రెట్ ను తెలుసుకుంది. ప్రతీ రోజు చెట్టుకు తలబాదుకోవటం ఓ ఎక్సైర్ సైజు కోసమేనని తెలుసుకుంది. అదోరకమైన వ్యాయామం అని తెలిపింది.

దీనిపై అతన్ని ప్రశ్నించగా అసలు విషయం చెప్పాడు.. ‘నేను చిన్నతనంలో బాక్సింగ్ చేసేవాడిని. పెళ్లయిన తర్వాత కుటుంబ బాధ్యతల్లో పడి బాక్సింగ్ పక్కన పెట్టాను. కానీ.., నాలో బాక్సింగ్ అంటే ఇంట్రెస్ట్ పోలేదు. అలాగని బాక్సింగ్ నేర్చుకోడానికి..ప్రతీ రోజు జిమ్‌కు వెళ్లి ప్రాక్టీస్ చేయడానికి నా దగ్గర డబ్బులు లేవు. కానీ ఏదోకరోజు నేను తప్పకుండా బాక్సింగ్ రింగులో వీరుడిలా పోరాడతాను. 

దాని కోసం శరీరాన్ని..ముఖ్యం నా తలను బలపరిచేందుకు..నా శరీరాన్ని దృఢంగా మార్చుకుంటున్నా. గత ఐదేళ్లుగా నా తలను గట్టిగా మార్చుకోడానికి రోజూ చెట్టును ఢీకొడుతున్నా. కేవలం తల మాత్రమే కాదు శరీరాన్ని సైతం చెట్టుతో ఢీకొట్టించి బలపడేలా చేస్తున్నా’’ అని చెప్పాడు. తెలిపాడు. 

అంతేకాదు..తనకు 65 ఏళ్లు వచ్చే వరకు తన తలను ఇలాగే బాదుకుంటానని అతడు తెలిపాడు. ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజనులు ఆశ్చర్యపోతున్నారు. బాక్సింగ్ అంటే ఇష్టం ఉండొచ్చు..కానీ ఇంత పిచ్చా..తలను అలా గాయపరుచుకోవడం వల్ల మెదడుకు ప్రమాదం జరిగే అవకాశముంటుందని సూచిస్తున్నారు.

Read: బాడీబిల్డర్ కండల్ని కరిగించేసిన కరోనా: దుక్కలా ఉండేటోడు..నక్కలాగైపోయాడు

మరిన్ని తాజా వార్తలు