అల్ట్రా ఫాస్ట్ ట్రైన్.. విమానం స్పీడ్ .. గంటకు 1000కి.మీ వేగంతో దూసుకెళ్లగలదు!

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

South Korea’s new experimental train : విమానాల్లో వేగం ట్రైన్లలో సాధ్యమేనా?  విమానం తరహా వేగంతో దూసుకెళ్లే హైపర్ సోనిక్ ప్రయోగాత్మక  ట్రైన్‌‌తో సాధ్యమేనంటోంది  సౌత్ కొరియన్..

అదే.. అల్ట్రా ఫాస్ట్ ట్రైన్.. గంటకు 1000 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లగలదు. ప్రస్తుతానికి ఈ ప్రాజెక్టు టెస్టింగ్ దశలో ఉండగా.. వర్కింగ్ ప్రూఫ్ మోడల్‌ను ప్రకటించింది. వాస్తవానికి ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ 2017లోనే ప్రారంభమైంది. లో- ప్రెజర్ ట్యూబ్‌తో లైటనింగ్ స్పీడ్‌‌తో ఈ అల్ట్రా ట్రైన్ ప్రయాణించగలదని KRRI అధికారి ఒకరు వెల్లడించారు.ప్రస్తుతం ఉన్న రైలు ప్రయాణ వేగానికి కంటే రెట్టింపు వేగంతో దూసుకెళ్లే ట్రైన్ సిస్టమ్‌ను క్రియేట్ చేయడమే లక్ష్యమన్నారు. ప్రస్తుతమన్న మ్యాగ్నెటిక్ లెగివేయషన్ (maglev) ట్రైన్లలో గంటకు 500 కిలోమీటర్ల వేగంతోనే ప్రయాణించగలవు. ఇప్పుడు అంతకంటే రెట్టింపు వేగంతో దూసుకెళ్లే హైపర్ ట్రైన్ ప్రయోగాత్మకంగా సక్సెస్ అయింది.

పవర్ ఫుల్ మ్యాగ్నిటిక్, వాక్యూమ్ ట్యూబ్‌ల సాయంతో ట్రైన్ వేగాన్ని మరింత పెంచవచ్చు. తొలి ప్రయోగాత్మక పరీక్షలో ఈ హైపర్ ట్రైన్ 620mph (గంటకు 1000కిలోమీటర్లు)వేగంతో ప్రయాణించింది. అంటే.. అంతర్జాతీయ విమానాలతో సమాన వేగంతో ప్రయాణించగలదని అధికారి తెలిపారు.2022 నాటికి పూర్తి స్థాయిలో రియల్ సైజు టెస్టింగ్ నిర్వహించేందుకు KRRI ప్లాన్ చేస్తోంది. వాస్తవానికి సౌత్ కొరియా.. అతిపెద్ద హైపర్ లూప్ ట్రైన్ నెట్ వర్క్‌ను 2024నాటికి ఆవిష్కరించాలని భావిస్తోంది.

ఈ అల్ట్రా ట్రైన్ ద్వారా సీయోల్, బుసాన్ మధ్య దూరం తగ్గనుంది. మూడు గంటల ప్రయాణం కాస్తా 30 నిమిషాల్లోనే గమ్యాన్ని చేరవేయగలదు. ఇప్పటికే సౌత్ కొరియాలో అదే రూట్లో హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్లు నడుస్తున్నాయి.సూపర్ సోనిక్ అల్ట్రా స్పీడ్ ట్రైన్లను తీసుకురావాలని కొరియా ప్రభుత్వం ఎప్పటినుంచో ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పటికే పలుదేశాల్లో ఈ తరహా సూపర్ సోనిక్ ట్రైన్లు అందుబాటులోకి వచ్చేశాయి. అమెరికా, కెనడా, చైనాతో పోటీగా సౌత్ కొరియా కూడా అల్ట్రా స్పీడ్ ట్రైన్లను ప్రవేశపెట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది.ఇంజినీరింగ్ విషయంలో కొన్ని లోపాల కారణంగా సౌత్ కొరియా ఈ ప్రాజెక్టును పట్టాలెక్కిండం సవాల్ గా మారింది. ఒకవేళ ప్రకృతి వైపరిత్యాల కారణంగా ఈ ట్రైన్లలోని వాక్యూమ్ ట్యూబ్ నెగటివ్ ప్రెజర్ కోల్పోతే మాత్రం ఒకదానికొకటి ఢీకొనే ప్రమాదం లేకపోలేదు. రాబోయే ఏళ్లలో ఈ సమస్యను అధిగమించేందుకు వాస్తవిక వర్కింగ్ టెస్టు సైటులో పరీక్షించాలని భావిస్తున్నట్టు అధికారి వెల్లడించారు.

Related Tags :

Related Posts :