లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Movies

బాలుకు కోపమొచ్చింది : హీరోయిన్ల డ్రెస్‌పై బాలు బోల్డ్ కామెంట్స్

Published

on

Sp Balasubrahmanyam Bold Comments On Heroines

హైదరాబాద్ : ప్రముఖ సింగర్ ఎస్పీ బాలసుబ్రమణ్యంకు కోపం వచ్చింది. ప్రస్తుతం హీరోయిన్లు వేసుకుంటున్న డ్రెస్‌లపై బాలుకు చీదరొచ్చింది. ఏంటా డ్రెస్‌లు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. హీరోయిన్లు వేసుకుంటున్న డ్రెస్‌లపై ఈ సింగర్ చేసిన కామెంట్స్‌పై టాలీవుడ్‌లో హాట్ హాట్ చర్చలు జరుగుతున్నాయంట. ప్రధానంగా హీరోయిన్లపై పలు కామెంట్స్ చేశారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఈ సింగర్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. 

వేదిక మీద స్త్రీ పాత్రధారిణి వచ్చి ఒక సభలో కూర్చొనేటప్పుడు ఎలాంటి బట్టలు వేసుకోవాలో అనే నిర్ణయం కూడా తీసుకోలేని ఒక అమాయక పరిస్థితి అనుకోవాలా ? లేక మరొకటి అనుకోవాలా అని బాలు ప్రశ్నించారు. కేవలం అంగాంగ ప్రదర్శన చేస్తేనే అక్కడ కూర్చున్న హీరోలు..నిర్మాతలు అవకాశం ఇస్తారోమో అనుకుని వచ్చేటటు వంటి రోజుల్లోకి సంస్కారం వెళిపోతోందని ఈ సింగర్ ఆవేదన వ్యక్తం చేశారు. హీరోయిన్లకు కోపం వచ్చినా ఫర్వాలేదని స్పష్టం చేశారు. చాలా మందికి తెలుగు తెలియదని…ఇది అర్థం కాదని సెటైర్ వేశారు. డబ్బు సంపాదించాలని అనుకుంటారు..అయితే ఒక నిబద్ధత..బాధ్యత..సమాజం పట్ల సృహ ఉండాలని బాబు సూచించారు. బాలు చేసిన వ్యాఖ్యలపై ఎలాంటి స్పందన వ్యక్తమౌతుందో చూడాలి. 

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *