నెల్లూరులోని తన నివాసాన్ని కంచి పీఠానికి ఇచ్చిన బాలు..

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

SPB House Donated for Kanchi Peetham: ప్రముఖ గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు నెల్లూరు జిల్లాతో ప్రత్యేకమైన అనుబంధం ఉంది. మద్రాస్ ప్రెసిడెన్సీలోని కోనేటమ్మపేటలో 1964 జూన్ 4న జన్మించారు బాలు. ఇప్పుడున్న నెల్లూరు జిల్లాగా ఆ ప్రాంతం ప్రసిద్ధి చెందింది. పుట్టి పెరిగిన ఊరు కావడంతో బాలుకి నెల్లూరుతో ప్రత్యేకమైన అనుబంధం ఉంది.

ఆ ఊరిలో తన తండ్రి నిర్మించిన ఇంటిని కంచి పీఠానికి విరాళంగా అందచేశారు బాలు. ఊ ఏడాది ఫిబ్రవరిలో కంచి పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతిని తన నివాసానికి ఆహ్వానించి నెల్లూరులోని ఇంటిని విరాళంగా అందిస్తున్నట్లు తెలియచేశారు.


బాలులోని సేవాగుణానికి మంత్రముగ్దులైన విజయేంద్ర సరస్వతి ఆ ఇంట్లో వేద పాఠశాల నిర్వహిస్తామని చెప్పారు. పీఠాధిపతి నిర్ణయంతో బాలు ఎంతో సంతోషించారు. తన నివాసం ఒక గొప్ప కార్యక్రమానికి వేదికవుతున్నందుకు చాలా ఆనందంగా ఉందని ఆనాటి కార్యక్రమంలో బాలు చెప్పారు.


Related Posts