మా నాన్నే మాకు ‘భారతరత్న’.. హాస్పిటల్ బిల్లుల చెల్లింపు విషయంలో స్పందించిన ఎస్పీ చరణ్..

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Sp Charan about SPB’s Hospital Bill: Sp balasubramaniam : దివంగత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వైద్య బిల్లుల చెల్లింపుల విషయంలో సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై ఆయన తనయుడు ఎస్పీ చరణ్ స్పందించారు. ఈ మేరకు బాలుకు చికిత్సనందించిన చెన్నై ఎంజీఎం హాస్పిటల్ మేనేజ్‌మెంట్‌తో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు.


హాస్పిటల్ బిల్లు చెల్లించాలని మేం ఉపరాష్ట్ర పతి వెంకయ్య నాయుడిని, ప్రభుత్వాన్ని అడిగామని తప్పుడు ప్రచారం జరిగిందన్నారు చరణ్. హాస్పిటల్ బిల్లులు మొత్తం తానే చెల్లించానన్నారు. నాన్నగారి మీద గౌరవంతో బ్యాలెన్స్ బిల్ కట్టనవసరం లేదని హాస్పిటల్ వారు చెప్పారని అన్నారు. సినిమా పరిశ్రమకు చెందిన వారు అంత్యక్రియలకు హాజరుకాలేదనే విషయం ఇప్పుడు అవసరంలేదని కొట్టిపారేశారు.
అసలు రూ.3కోట్లు ఏంటో, ఇంకా రూ.1 కోటి 85 లక్షలు పే చేయాలనే వార్త ఎక్కడినుంచి వచ్చిందో తెలియడం లేదు. వైస్ ప్రెసిడెంట్ గారు, వారి కుమార్తె దీపా గారు ఈ విషయంలోకి ఎందుకు వచ్చారో.. మా రిలేషన్ బాగుంది.. దయచేసి ఇలాంటి కట్టుకథలతో దాన్ని పాడుచేయకండి.. ప్రభుత్వం ఒప్పుకుంటే ఇస్తారు.. మా నాన్నే మాకు భారతరత్న అన్నారు. త్వరలో నాన్న గారి మెమోరియల్ ఏర్పాటు చేసి అభిమానులు నాన్న సమాధిని సందర్శించేలా అవకాశం కల్పిస్తాం అని చెప్పారు ఎస్పీ చరణ్.

Related Posts