నాన్న నోటిద్వారా ఆహారం తీసుకుంటున్నారు:ఎస్పీ చరణ్..

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

SPB Health Update: కరోనా బారినపడి చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న ప్రముఖ గాయకులు ఎస్పీ బాల సుబ్రమణ్యం ఆరోగ్య పరిస్థితి గురించి తాజా సమాచారాన్ని ఆయన తనయుడు ఎస్పీ చరణ్ తెలియచేశారు.


‘‘నాన్న నిన్నటి నుంచి నోటి ద్వారా ఆహారం తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా వుంది. ఎక్మో, వెంటిలేటర్ సాయంతో చికిత్స కొనసాగుతుంది. ప్రతిరోజు కొన్ని నిమిషాల పాటు లేచి కూర్చుంటున్నారు. ఫిజియోథెరపీ కూడా చేయించుకుంటున్నారు. అయితే ఊపిరితిత్తుల పనితీరు మరింత మెరుగుపడాల్సిన అవసరం ఉంది. తేలికగా శ్వాస తీసుకోవడాని అది ఎంతగానో ఉపయోగ పడుతుంది..


ఎలాంటి ఇతర ఇన్‌ఫెక్షన్లు లేవు.. ఇకపై ఆయన త్వరగా శక్తిని పుంజుకుంటారని భావిస్తున్నాం.. ఎంజీఎం వైద్య బృందం అందిస్తున్న సేవలు సంతృప్తికరంగా వున్నాయి. నాన్న ఆరోగ్యం కోసం ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’’.. అని తెలిపారు చరణ్.

Related Posts