బాలు.. చరణ్‌లతో అజిత్ అనుబంధం.. ఆసక్తికర విషయాలు..

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

SPB-Ajith, SP Charan: గాన గంధర్వుడు ఎస్‌.పి. బాలుసుబ్రహ్మణ్యం ఇక లేరనే విషయం సంగీత ప్రపంచం ఇంకా జీర్ణించుకోలేకపోతుంది. ఏదో ఒక రూపంలో బాలుని తలుచుకుంటూనే ఉన్నారు. ఆయన మనిషి మాత్రమే లేడు.. ఆయన పాట మాత్రం ఎప్పుడూ మనతోనే ఉంటుంది.. ఎల్లప్పుడూ వినబడుతూనే ఉంటుంది.


బాలు మరణం తర్వాత చాలా విషయాలు వెలుగు చూస్తున్నాయి.. తాజాగా ట్విట్టర్, ఇన్ ‌స్టాగ్రామ్‌లో బాలు కుటుంబానికీ, తమిళ స్టార్ హీరో ‘తల’ అజిత్‌కి మధ్య ఉన్న అనుబంధం గురించి ఆసక్తికర వార్తలు వస్తున్నాయి..


వివరాళ్లోకి వెళ్తే.. బాలు తనయుడు చరణ్‌, స్టార్‌ హీరో అజిత్‌ స్కూల్‌ అండ్ కాలేజ్ మేట్స్. చిన్నప్పుడు అజిత్‌ ఎక్కువగా బాలు వాళ్ల ఇంట్లోనే ఉండేవారట. అజిత్‌ సినిమా ప్రస్థానం.. ఎస్‌.పి. బాలు రికమండేషన్‌తోనే మొదలైందట. అదెలా అంటే.. ఓసారి మోడలింగ్‌ షూట్‌ కోసం.. చరణ్‌ షర్ట్ తీసుకునేందుకు వచ్చిన అజిత్‌ని బాలు బాగా గుర్తుపెట్టుకున్నారట.


ఆ తర్వాత గొల్లపూడి మారుతీరావు తనయుడు గొల్లపూడి శ్రీనివాసరావు దర్శకత్వం వహించబోయే సినిమాకి హీరో కోసం వెతుకుతున్నారని తెలిసి.. బాలు, అజిత్‌ పేరు సూచించారట. అలా అజిత్‌ హీరోగా మారారు.


అజిత్‌ నటించిన స్ట్రైట్‌ తెలుగు సినిమా ఇదే. టైటిల్.. ‘ప్రేమ పుస్తకం’. అలా అజిత్‌ హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి బాలు కారణమయ్యారు. అప్పటి నుంచి అజిత్‌, బాలు ఫ్యామిలీతో ఎంతో అన్యోన్యంగా ఉండేవారట. అదీ సంగతి..


Related Tags :

Related Posts :