బాలు స్వహస్తాలతో రాసిన లెటర్ చూశారా!

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

SP Balu Letter with his hand writing: గత 52 రోజులుగా చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం.. అశేష అభిమానులను శోకసంద్రంలోకి నెట్టేశారు. శుక్రవారం మధ్యాహ్నం 1.04 గంటలకు బాలు తుదిశ్వాస విడిచినట్టు ప్రకటించారు.

అనారోగ్యం నుంచి కోలుకుని బాలు మళ్లీ పాడతారని ఆశించిన సినీ జనం.. ఆయన మరణ వార్తను విని దిగ్భ్రాంతికి లోనయ్యారు.. సినీరాజకీయ ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు..


ఆయన క్షేమంగా వస్తారని ఎందరో, ఎన్నో ప్రార్థనలు చేశారు. అవి ఏవీ ఫలించలేదు. ఒక శకం ముగిసినట్లుగా సినిమా పరిశ్రమలు తల్లడిల్లిపోతున్నాయి. ఇక ఆయన జ్జాపకాలను అంతా నెమరు వేసుకుంటున్నారు.

తాజాగా ఆయన స్వహస్తాలతో రాసిన లేఖ ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఇందులో ఆయన ఓ కార్యక్రమం నిమిత్తం వివరణ ఇస్తూ.. కొన్ని చిన్న చిన్నఅభ్యర్థనలను మీరు మన్నించాలని కోరుతూ.. నా పేరు ముందు ‘డాక్టర్‌’, ‘పద్మభూషణ్‌, ‘గానగంధర్వ’ వంటి విశేషణలు వేయకండి.. అని కోరారు.. ప్రస్తుతం ఈ లేఖ సోషల్‌ మీడియాలో వైరల్ అవుతుంది.


కాగా రేపు (సెప్టెంబర్ 26) సాయంత్రం తమిళనాడు తిరువళ్లూరు జిల్లా రెడ్‌హిల్స్‌ సమీపంలోని తామరైపాకం గ్రామంలో ఎస్పీ బాలు అంత్యక్రియలు జరుగనున్నాయి.

SP Balu Letter

Related Posts