బాలు చివరి కోరిక ఏమిటంటే….

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

“అనాయాసేన మరణం
వినా ధైన్యేన జీవనం
దేహాంతే తవ సాన్నిధ్యం
దేహిమే పరమేశ్వరం.”
అని భక్తులు ఈశ్వరుడ్ని ప్రార్ధిస్తారు. కానీ ఈ కోరిక బాలుకు తీరలేదు.

అనాయాసేన మరణం కలగాలని ఆయన కోరుకున్నారు. చావంటే తెలియకుండా కన్నుమూయాలి…. ఓపికున్నంత వరకు పాటలు పాడుతూ ఉండాలని ఒకానొక సందర్భంలో బాలు వ్యాఖ్యానించారు. కానీ విధి చాలా విచిత్రమైనది. దాదాపు 52 రోజులు పాటు మృత్యువుతో పోరాడి, ఓడి 2020, సెప్టెంబర్ 25న చెన్నై లోని ఎంజీఎం ఆసుపత్రిలో కన్నుమూశారు.

సాహిత్యాన్ని అర్థం చేసుకుని, పాట ఆత్మను ఆవాహనం చేసుకుని ఆలపించే అరుదైన గాయకుడిగా ఆయనది ఓ ప్రత్యేక పథం. అంతేగాక,సందర్భం కుదిరినప్పుడల్లా అమ్మభాష కోసం గళమెత్తే బాలు గారు, గత జూన్ నెలలోనే డెబ్బై అయిదో వడిలోకి అడుగుపెట్టారు.

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నరోజుల్లోనే ఆరోగ్యం కాస్త కుదుట పడినప్పుడు వివాహా వార్షికోత్సవాన్నిజరుపుకున్నారు ఎస్పీబాలు. తను కోరుకున్న మరణం రాక అనారోగ్యంతో పోరాడి తనువు చాలించారు.

ఈ భువి లో విరిసి
దివికేగిన పారిజాతమా!
స్వర పారిజాతమా!
ఇంతవరకూ పాడావు తీయగా
పాత తరాన్ని కొనియాడ్తు హాయిగా
“రామకథ శ్రీ రామ కథ ”
అంటూ అడుగిడి
వేవేల అడుగులు నడిచి
ఎందరినో నడిపించి
నేడు నీ అభిమానుల నేడిపించి
ఏమిటి ఈ వింతయ్యా!
ఎందుకిలా చేసావయ్యా!
గెల్చుకున్న మా హృదిలో
నిలిచావు ధ్రువ తారగా
గాన గంధర్వా!!
అని అభిమానులు బాధా తప్తహృదయాలతో తల్లడిల్లుతున్నారు.

Related Posts