SP MP Ram Gopal Yadav Questions BJP

ఎస్పీ క్వశ్చన్ : ఔట్‌సోర్సింగ్‌లో రిజర్వేష‌న్లు వ‌ర్తిస్తాయా

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ఈబీసీ రిజర్వేషన్ల బిల్లు రాజ్యసభలో వాడీవేడి చర్చకి దారితీసింది. విపక్షాలు అధికారపక్షంపై ప్రశ్నాస్త్రాలు సంధించాయి. ఔట్‌సోర్సింగ్‌లో కూడా రిజర్వేషన్లు వర్తిస్తాయా? అని సమాజ్‌వాదీ పార్టీ  ఎంపీ రాంగోపాల్ యాదవ్ అడిగారు. ఈ రోజుల్లో ఎక్కువ శాతం ఉద్యోగాల‌ను ఔట్‌సోర్సింగ్ చేస్తున్నార‌ని ఆయన గుర్తు చేశారు. ఈబీసీ బిల్లుకు స‌మాజ్‌వాదీ పార్టీ మ‌ద్ద‌తు తెలుపుతూనే పలు ప్రశ్నలు సంధించింది. 98శాతం ఉన్న పేద‌ల‌కు.. కేవ‌లం 10 శాతం రిజ‌ర్వేష‌న్ ఇవ్వ‌డం ఏంట‌ని నిలదీశారు.

* ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్‌లో.. జ‌న‌ర‌ల్ కోటాలో ద‌ళితులు క‌టాఫ్ మార్కుల క‌న్నా ఎక్కువ సాధించినా, వారిని రిజ‌ర్వేష‌న్ కోటాకే ఎందుకు సెలెక్ట్ చేస్తున్నారు
* ఇప్ప‌టివ‌ర‌కు రిజ‌ర్వేష‌న్ పొందిన వారి స్థితిగ‌తులు ఏమైనా మారాయా?
* ద‌ళితుల్లో క్లాస్ వ‌న్ ఉద్యోగులు ఎంత‌మంది ఉన్నారు
* మీడియాలో కేవ‌లం మూడు శాతం మంది మాత్ర‌మే ద‌ళితులు ఉన్నారు
* జ‌నాభా ప్ర‌తిపాదిక‌న ఓబీసీ రిజ‌ర్వేష‌న్లు 54 శాతానికి పెంచాలి

Related Posts