లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

ఒకేసారి 143 శాటిలైట్లు పంపి ఇస్రో రికార్డు బ్రేక్ చేసిన స్పేస్ఎక్స్

Published

on

SpaceX: స్పేస్ఎక్స్ ఫాల్కన్ 9రాకెట్ 143 శాటిలైట్లను ఆర్బిట్ లోకి మోసికెళ్లి రైడ్ షేర్ మిషన్‌ను ఆదివారం సక్సెస్ చేసుకుంది. దీంతో సింగిల్ రాకెట్ లాంచ్ చేసి రికార్డులు సృష్టించింది. అంతకంటే ముందు ఇండియన్ శాటిలైట్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) పేరిట 2017లో లాంచ్ చేసిన 104శాటిలైట్ల రికార్డు ఉండేది.

స్పేస్ ఎక్స్ ట్రాన్స్‌పోర్టర్-1 మిషన్ ను స్పేస్ఎక్స్ 2019లోనే అనౌన్స్ చేసింది. ఈ మిషన్ సాయంతో వరదలు, ఐస్ స్థితిగతులను గురించి మానిటర్ చేయొచ్చు. గత ఐదేళ్లుగా పాపులారిటీ దక్కించుకున్న స్మాల్ సాట్స్‌ను వర్క్‌హోర్స్ ఫాల్కన్ 9 రాకెట్ మోసుకెళ్లింది. అవి స్మార్ట్ ఫోన్ సైజ్ నుంచి ఫ్రిజ్ అంత సైజ్ వరకూ ఉంటాయి.

స్మాల్ శాట్స్ అనేవి పెద్ద వాటితో కలిపి ఉండాల్సిందే. ఇవి చాలా ఖరీదైనవి కూడా. వీటి వెయిటింగ్ లిస్ట్ కూడా నిర్వచించలేం. ఈ స్మాల్ శాట్స్ ను రెడీ చేస్తామని డజన్ల కొద్దీ పోటీపడ్డాయని.. రాకెట్ ల్యాబ్, వర్జిన్ ఆర్బిట్ లు మాత్రమే సరైన సైజ్.. లో కమర్షియల్ ఆపరేషన్స్ కు సరిపడ శాటిలైట్లను లాంచ్ చేశాయి.

స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్లు అనేవి రాకెట్ ల్యాబ్, వర్జిన్ ఆర్బిట్ రాకెట్స్ కంటే చాలా పెద్దవి. వాటిని హెఫ్టీ కమ్యూనికేషన్స్, స్పై శాటిలైట్స్, డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ లు లాంచ్ చేయడం కోసం ఉపయోగిస్తాయి. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి ఆస్ట్రోనాట్స్, కార్గో లను ఇటువైపుకు చేర్చేందుకు సహకరిస్తాయి.

ఇటువంటి భారీ ప్రయోగం చేయడం ఇదే మొదటిసారి కాగా.. ఇంత పెద్ద మిషిన్ సక్సెస్ అవడం వెనుక ఇండస్ట్రీపై ఇంట్రస్ కనిపిస్తుంది.