లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

International

అయ్యో..పాపం పసిపిల్లలు : కడుపు నొప్పి సిరప్ తాగిన చిన్నారులకు ఒళ్లంతా వెంట్రుకలు

Published

on

Spain‌ : 20 children sprout hair all over their bodies : కడుపు నొప్పిని సిరప్ తాగితే..ఒళ్లంతా వెంట్రుకలు వచ్చేశాయి. దీంతో పాపం ఆ చిన్నారుల్ని చూస్తుంటే కడుపు తరుక్కుపోతోంది. ఒళ్లంతా వెంట్రుకలు రావటంతో పాటు జుట్టు రంగు కూడా మారిపోవటంతో తల్లిదండ్రులు భయపడిపోయి వెంటనే హాస్పిటల్ కు తరలించారు.వివరాల్లోకి వెళితే..స్పెయిన్‌లోని కాంటాబ్రియాకు చెందిన అమయా, డానియల్ దంపతులు తమ కూతురు శరీరంపై ఒత్తుగా వెంట్రులకు పెరగటం చూసి ఆశ్చర్యపోయారు. ఏకంగా మగాళ్లకు మల్లే మీసాలు కూడా మొలిశాయి. గతంలో ఆ చిన్నారి జుట్టు బ్రౌన్ కలర్ లో ఉండేది. అదేరంగు జట్టుతోనే పుట్టింది.కానీ గత 22 వారాల క్రితం వరకూ ఆ చిన్నారి జుట్టు బ్రౌన్ కలర్ లోనే ఉండేది. అదికాస్త గత ఏడు నెలల నుంచి నల్లటి రంగులోకి మారిపోతూ వచ్చింది. అలా ఒళ్లంతా నట్టిటి ఒత్తైన వెంట్రుకలు దట్టంగా పెరగడం మొదలైంది. అలా మొత్తం శరీరమంతా నల్లని వెంటుకలతో నిండిపోయింది. దీంతో అమయా దంతులు కూతుర్ని డాక్టర్ల దగ్గరకు తీసుకెళ్లి విషయం చెప్పి వాపోయారు.అన్ని విషయాలు విన్న డాక్టర్లు చిన్నారికి పరీక్షలు చేశారు. మీ ఫ్యామిలీలో ఎవరికైనా ఇటువంటిసమస్య ఉందాని అడిగారు. దానికి అమయా ఎవరికి ఇటువంటి సమస్య లేదని చెప్పింది. దానికి వెంటనే డాక్టర్లు ఈ మధ్య కాలంలో పాపకు ఏమైనా మందులు వాడారా? అని అడుగగా..అమయా ‘‘ఆ మధ్య మా పాపకు కడుపు నొప్పి వచ్చిందనీ..టాబ్లెట్స్ వేస్తే మింగలేదనే ఉద్దేశంతో స్థానికంగా ఉండే ఓ ఫార్మసీలో ఓ సిరప్ తీసుకుని తాగించామని చెప్పింది.దానికి డాక్టర్లు ఆ సిరప్ ను తెప్పించి శాంపిళ్లను పరిశీలించారు. ఆ సిరప్ లో కలిపిన పదార్థం వల్ల చిన్నారికి అలా శరీరమంతా వెంటుకలు మొలుస్తున్నాయని గుర్తించారు. ‘ఓమేప్రజోలే’ (Omeprazole) అనే ఆ సిరప్‌లో మినోక్సిడిల్ కలిసినట్లు గుర్తించారు.ఈ విషయం పెద్ద వివాదంగా మారింది. వెంటనే స్పెయిన్ ప్రభుత్వం మెడిసినస్ అండ్ హెల్త్ ప్రొడక్ట్స్ వెంటనే ఆ సిరప్ అమ్మకాలను నిలిపేయాలని ఆదేశించింది. కాకపోతే అవి అప్పటికే చాలామంది దాన్ని వాడారు. అలా వాడినవారందకి ఇలా వెంట్రుకల సమస్య వచ్చిందని తేలింది.
అలా 20 మంది చిన్నారులకు శరీరమంతా వెంట్రుకలు మొలిచాయి. ఈ సమస్యను హైపర్ట్రికోసిస్ (Hypertrichosis) అంటారని సీనియర్ డాక్టర్లు తెలిపారు. దీనిపై స్పందించిన ప్రభుత్వం బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చింది. ఆ సిరప్ తయారు చేసిన ఫార్మసీ సంస్థ మీద క్రిమినల్ లాసూట్ దాఖలు చేశారు. దీనికి తగిన ఆధారాలు సేకరించే పనిలో అధికారులు బిజి బిజీగా ఉన్నారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *