ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. విరిగిపడుతున్న కొండచరియలు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Spain Canarian Island Chunks of Cliff collapse : కొండచరియలు విరిగిపడటం దగ్గర నుంచి ఎప్పుడైనా చూశారా? ఒళ్లు గగుర్పొడిచేలా అనిపించిందా? అలాంటి ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.సముద్ర తీరంలో చూస్తుండగానే భారీ కొండచరియ విరిగి పడింది. వీడియో వైరల్‌గా మారింది. స్పెయిన్‌లోని కానరీ ద్వీపంలోని లా గొమేరియా బీచ్‌లో ఈ ఘటన జరిగింది.సముద్రం ఒడ్డున ఎత్తైన కొండ నుంచి కొండ చరియ నీటిలోకి పడిపోయింది. తొలుత కొద్దిగా మట్టి, రాళ్లు పడగా.. కొద్ది క్షణాల వ్యవధిలోనే పెద్ద కొండ చరియ సముద్రంలోకి విరిగిపడింది.అధికారులు వెంటనే నిషేధాజ్ఞలు విధించారు. కానరీ ద్వీపాల అధ్యక్షుడు షేర్‌ చేసిన ఈ వీడియోకు లక్షల వ్యూస్‌ వచ్చాయి. వైరల్ అవుతున్న వీడియో ఇదే..

Related Tags :

Related Posts :