అత్యంత విషమంగా ఎస్పీ బాలు ఆరోగ్యం.. ఇష్టమైన పాటలు వినిపిస్తున్న డాక్టర్లు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

SPB health update: ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్యం అత్యంత విషమంగా మారిపోయింది. ఆగస్టు 5వ తేదీ నుంచి కరోనాతో చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలు ఆరోగ్యం ఆందోళనకర స్థాయిలో క్షీణించిందని ఎంజీఎం డాక్టర్లు చెబుతున్నారు.

‘Paadum Nila’ S.P. Balasubrahmanyam: బాలుకు ఎక్మో, వెంటిలేటర్‌ ద్వారా చికిత్స అందిస్తుండగా.. కరోనా నుంచి కోలుకున్నప్పటికీ ఊపిరితిత్తులు తీవ్రంగా దెబ్బతినటంతో కృత్రిమ శ్వాస ద్వారానే ఆయనకు చికిత్స అందిస్తూ వచ్చారు. ఫిజియో థెరపీ కూడా చేయగా.. బ్రెయిన్‌ హ్యామరేజ్‌ అయినట్టు తెలుస్తుంది. బాలు ఆరోగ్యంపై సినీలోకం, అభిమానులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు.ఈ క్రమంలోనే ప్రముఖ నటుడు కమల్‌హాసన్‌ కూడా ఆసుపత్రికి వెళ్లి బాలు ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేశారు. మధ్యాహ్నం బాలు ఆరోగ్య పరిస్థితపై హెల్త్ బులిటెన్ విడుదల చేసే అవకాశం కనిపిస్తుంది. తమిళనాడు ఆరోగ్య మంత్రి విజయ్ భాస్కరన్ కూడా ఆసుపత్రికి చేరుకున్నారు. బాలు ఆరోగ్య పరిస్థితి గురించి దేశవ్యాప్తంగా పలువురు వాకబు చేస్తున్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్య కూడా దీనిపై వాకబు చేస్తుండగా.. చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రి దగ్గర ఉద్విగ్న వాతావరణం చోటుచేసుకంది.

బాలు ఆరోగ్యం గురించి ఆందోళన వ్యక్తం అవుతున్న క్రమంలో సెలబ్రిటీలు, నాయకులు ఆసుపత్రి వద్దకు చేరుకుంటున్నారు. సాయంత్రం ఆరు గంటల తర్వాత బాలు ఆరోగ్యంపై పూర్తిస్థాయి ప్రకటన ఉండే అవకాశం కనిపిస్తుంది. చేదు కబురు ఏం వినాల్సి వస్తుందో? అని ఆందోళనలో ఉన్నారు అభిమానులు. ఈ క్రమంలో ఇష్టమైన పాటలను ఆయనకు వినిపిస్తున్నారనే సమాచారం వస్తుంది. ఆసుపత్రి పక్కనే ఉన్న స్థలాన్ని చదును చేస్తున్నారు అధికారులు.

Related Posts