spb-patient-who-inspired-his-doctors-to-the-end

వైద్యులకు ధైర్యం చెప్పిన SPB..ఆసుపత్రిలో ఏమి జరిగిందంటే

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ప్రముఖ లెజండరీ సింగర్ బాల సుబ్రమణ్యం చివరి వరకు వైద్యులను ప్రోత్సాహించారు. కొన్ని రోజులుగా చికిత్స పొందుతున్న ఆయన ఎక్కడా ధైర్యం కోల్పోలేదని ఆయనకు చికిత్స అందించిన వైద్యులు తెలిపారు. V. Sabanayagam (clinical lead, Multidisciplinary Intensive Care, MGM Hospitals) ఆయనకు చికిత్స అందించిన వారిలో ఉన్నారు.



52 రోజుల పాటు..ఆయన ఆహ్లాదకరంగా..సంతోషంగా ఉన్నారని, ఆరోగ్యవంతంగా కోలుకోవాలని బాలు అనుకున్నారని వెల్లడించారు. కోవిడ్ 19 పరీక్షలు నిర్వహించిన తర్వాత ఫ్యామిలీ డాక్టర్ Deepak Subramanian సలహా మేరకు ఆసుపత్రిలో చేరడం జరిగిందన్నారు.



అనారోగ్యాన్ని అధిగమించేందుకు ఏమి చేయాలో అది చేయాలని అనుకుంటున్నట్లు బాలు వెల్లడించారని తెలిపారు. మొదటి మూడు రోజులు చాలా బాగానే ఉన్నారని, కానీ..తర్వాత..వ్యాధి ముదిరిపోయిందన్నారు. ఆక్సిజన్ అవసరం వచ్చిందని, ఆగస్టు 09వ తేదీన high dependency unit కు మార్చామన్నారు.



ఆగస్టు 13వ తేదీన మెరుగైన చికిత్స చేయాల్సి వచ్చిందని, అప్పటికే కోవిడ్ 19లో భాగంగా ప్లాస్మా థెరపీ, ఇతర చికిత్స పొందుతున్నారని వెల్లడించారు. వెంటిలెటర్ లో ఉంచాలని తాము తీసుకున్న నిర్ణయాన్ని బాలుకు ఎలా చెప్పాలో సందిగ్ధంలో పడిపోయామన్నారు. దీనిపై ..బాలు వాదన చేస్తారని అనుకున్నామన్నారు.



కానీ..చేయాల్సింది చేయండి..అనే విషయం చెప్పారన్నారు. ఆక్సిజన్ మరింత అవసరం కావడంతో ఆగస్టు 14వ తేదీన Extracorporeal Membrane Oxygenation (ECMO) పరికరం ఏర్పాటు చేశామన్నారు. దీనితర్వాత..అతను కోలుకున్నట్లు, నిలబడడం, కూర్చొగలగడం చేశారన్నారు. అనూహ్యంగా 48 గంటల తర్వాత..రక్తపోటు పడిపోయందన్నారు.



దీని కారణంగా..పెద్ద మొత్తంలో మందులు అవసరమయ్యాయని, మెదడులో తీవ్రమైన రక్తస్రావం జరిగినట్లు స్కాన్ లో ఉందన్నారు. తాము చేస్తున్న ప్రయత్నాలను బాలు కుటుంబం అర్థం చేసుకుందని, కృతజ్ఞతలు తెలిపిందని డాక్టర్ Dr. Sabanayagam చెప్పారు. అయినా..అతని ఆరోగ్యం మరింత క్షీణించిందని చివరకు శుక్రవారం రాత్రి 1.04 గంటలకు తుదిశ్వాస విడిచారన్నారు. చనిపోవడాన్ని తాము జీర్ణించుకోలేకపోతున్నామని Suresh Rao (director, Heart and Lung Transplantation Programme) వెల్లడించారు.

Related Posts