పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది..బాలు గొప్పతనాన్ని గుర్తించిన ఆనాటి మీడియా

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

మద్రాసులో ఏఎంఐఈ చదవుకుంటూ తనకున్న సంగీత పరిజ్ఞానంతో మద్రాసులో జరిగే సంగీత కార్యక్రమాల్లో పాటలు పాడుతూ బహుమతులు అందుకుంటున్న ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మొదటి సారిగా 1966 లో శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న సినిమాతో తన సినీ ప్రస్ధానాన్ని మొదలెట్టారు. తన సినీ ప్రస్ధానంలో పలు అవార్డులు అందుకున్నారు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్నట్టు మొదటి సినిమాలో పాడిన పాటలతోటే ఆనాటి మీడియా ఎస్పీబాలు లోని గొప్ప తనాన్ని గుర్తించింది.

sp balu article

అమర గాయకుడు ఘంటసాల తర్వాత తెలుగు సినీ పాటకు సిసలైనవారసుడిగా 40 ఏళ్ల సినీ ప్రస్ధానంలో 40వేల పాటలను 11 భాషల్లో పాడి 40 సినిమాలకు సంగీత దర్శకత్వం వహించారు. గాయకుడిగా, నటుడిగా, సంగీత దర్శకుడిగా, నిర్మాతగా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా బహుముఖ ప్రజ్ఞాశాలి అనిపించుకున్నారు. బాలు గారికి తెలియని విషయాలు లేవు.

తనకు సినీ జీవితాన్ని ప్రసాదించిన ఎస్పీ కోదండపాణిపై భక్తితో అభిమానంతో తాను నిర్నించుకున్న ఆడియో ల్యాబ్ కు కోదండపాణి ఆడియో ల్యాబ్ అనే పేరు పెట్టుకున్నారు. కేవలం గాయకుడే కాదు,వక్త గా,ప్రయోక్త గా,సంగీత దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న నటుడుగా, డబ్బింగ్ కళాకారుడు గా ఎన్నో రకాలుగా ఆయన ప్రత్యేకత చాటుకున్నారు. 2010లో కమల్ హాసన్ కథానాయకుడిగా వచ్చిన దశావతారం చిత్రంలో కమల్ పోషించిన పది పాత్రల్లో 7 పాత్రలకు బాలునే డబ్బింగ్ చెప్పడం విశేషం. ఇందులో కమల్ పోషించిన ముసలావిడ పాత్ర కూడా ఉంది.

అన్నమయ్య చిత్రంలో సుమన్ పోషించిన వేంకటేశ్వర స్వామి పాత్రకు, సాయి మహిమ చిత్రంలో బాలు డబ్బింగ్ చెప్పాడు. ఈ రెండు చిత్రాలకు ఆయనకు ఉత్తమ డబ్బింగ్ కళాకారుడిగా నంది పురస్కారం లభించింది. చాలామంది నటులకు వారి హావభావలకు, నటనా శైలులకు అనుగుణంగా అతను పాటలు పాడి ప్రాణం పోశారు.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నంది పురస్కారాన్ని 29 సార్లు అందుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలి ఈ గాన గంధర్వుడు ఎస్పీబాల సుబ్రహ్మణ్యం

Related Posts