Special Effects Legend Eknath Passed Away

స్పెషల్ ఎఫెక్ట్స్ ఏక్‌నాథ్ కన్నుమూత

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

సినీ రంగంపై ఉన్న అమితాసక్తితో 55 ఏళ్ళ క్రితమే ఏక్‌నాథ్ మద్రాసు వెళ్ళారు..

సినీ పరిశ్రమలో స్పెషల్ ఎఫెక్ట్స్ కింగ్‌గా పేరొందిన ఏక్‌నాథ్ కన్నుమూసారు. ఆయన వయసు 70 సంవత్సరాలు. ఆంధ్రప్రదేశ్ కృష్ణాజిల్లాలోని మచిలీపట్నం ఆయన స్వస్థలం. ప్రముఖ కెమెరామెన్ మోహనకృష్ణ ఏక్‌నాథ్ సోదరుడు. సినీ రంగంపై ఉన్న అమితాసక్తితో 55 ఏళ్ళ క్రితమే ఆయన మద్రాసు వెళ్ళారు. కంప్యూటర్ అంటే ఏంటో పెద్దగా తెలియని, పెద్దగా కంప్యూటర్ వాడకం లేని రోజుల్లోనే స్పెషల్ ఎఫెక్ట్స్ క్రియేటర్‌గా గుర్తింపు పొందారు ఏక్‌నాథ్.

తెలుగు సినిమాకు మ్యాజిక్కులూ, జిమ్మిక్కులూ పరిచయం చేసిన విఠాలాచార్య అప్పట్లోనే అద్భుతమైన టెక్నాలజీ వాడారు. గ్రాఫిక్స్‌లేని కాలంలోనే చారిత్రక, పౌరాణిక, జానపద సినిమాల్లో సన్నివేశాలను తన ప్రతిభతో రక్తి కట్టించిన ఏక్‌నాథ్, అనేక త్రీడీ సినిమాలకు స్పెషల్ ఎఫెక్ట్స్ డైరెక్టర్‌గా పని చేసారు. ఆయన కెరీర్‌లో 700 సినిమాలకు ఎఫెక్ట్స్ చేసారు. అమితాబ్ బచ్చన్, ఎన్టీఆర్, రజినీకాంత్, కమల్ హాసన్‌తో సహా ఎందరో స్టార్ హీరోల సినిమాలకు ఏక్‌నాథ్ పనిచేసారు. ఆయన మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.

Related Posts