కేవలం రూ.300 మందులతో కరోనా నయం, వైరల్‌గా మారిన ఏపీ స్పెషల్ ఆఫీసర్ కొవిడ్ 19 ప్రిస్క్రిప్షన్, రూ.300 వైద్యం వివరాలు తెలుసుకున్న పాండిచ్చేరి సీఎం

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Covid-19 Rs 300 prescription:  ఏపీ కోవిడ్ 19 కంట్రోల్ స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ సి.ప్రభాకర్ రెడ్డి పెట్టిన ఓ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కేవలం రూ.300 ఖరీదు చేసే మందులతో కరోనాను నయం చేయొచ్చు అంటూ ఆయన ఓ పోస్టు పెట్టారు. స్వల్ప లక్షణాలు ఉన్న కరోనా పేషెంట్లకు ఈ మందులతో నయం చేయొచ్చని చెబుతూ ఆయన కొన్ని మందులు సూచించారు. ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అన్ని సోషల్ మీడియా వేదికల్లో హల్ చల్ చేస్తోంది.

డాక్టర్ రెడ్డి.. కార్డోఆర్థియాక్, వాస్కులార్ సర్జరీ సర్జన్. కేవలం 10 రోజుల్లోనే కరోనా నయం అవుతుందని ఆయన చెప్పారు. ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లాల్సిన అవసరం లేదని, లక్షలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదని డాక్టర్ రెడ్డి వివరించారు. కేవలం రూ.300 మందులతోనే కరోనా నయం అవుతుందన్నారు.

medicine kit

అయితే రోగి ఆక్సిజన్ లెవన్ కచ్చితంగా 93శాతానికి పైగా ఉండాలన్నారు. హోం క్వారంటైన్ లో ఉండే కరోనా పేషెంట్లు కేవలం రూ.300 మెడికిన్ కిట్ తీసుకుంటే చాలన్నారు. ఒకవేళ ఏదైనా ఎమర్జెన్సీ వస్తే, పేషెంట్లు 104కి కాల్ చేసి ఆసుపత్రిలో అడ్మిట్ కావొచ్చన్నారు. ప్రజలు అనవసరంగా కరోనా గురించి భయపడొద్దని, అనవసరంగా డబ్బుని ఖర్చు పెట్టొద్దని కోరారు.

వాస్తవంగా కరోనా చికిత్స అందుకు అయ్యే ఖర్చుపై ప్రజల్లో అవగాహన తీసుకొచ్చేందుకు తాను ఈ మేసేజ్ పెట్టానని డాక్టర్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం అందరికి కరోనా భయం పట్టుకుంది. కరోనా పేరు చెబితేనే వణికిపోతున్నారు. ఏ చిన్న లక్షణం కనిపించినా, అనుమానం వచ్చినా ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు. ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రుల్లో కరోనా చికిత్స పేరుతో లక్షలు వసూలు చేస్తున్నారు.

కరోనా వైరస్‌ నుంచి బాధితులు త్వరగా బయటపడడానికి ఏపీ స్టేట్‌ కోవిడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ప్రత్యేకాధికారి డాక్టర్‌ సి.ప్రభాకర్‌రెడ్డి సూచించిన రూ.300 వైద్యం ఇతర రాష్ట్రాలనూ ఆకర్షిస్తోంది. ఆదివారం రాత్రి పాండిచ్చేరి సీఎం వి.నారాయణస్వామి, ఆ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కృష్ణారావు తదితరులు అమెరికాకు చెందిన డాక్టర్లతో పాటు ప్రభాకర్‌రెడ్డితో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా పాండిచ్చేరిలో కరోనా తీవ్రత గురించి.. దాన్ని నియంత్రించడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించినట్లు ప్రభాకర్‌రెడ్డి తెలిపారు.

ఈ సమయంలో రూ.300 వైద్యం గురించి మంత్రి కృష్ణారావు పాండిచ్చేరి సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు ప్రభాకర్‌రెడ్డి వివరించారు. పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా మందుల గురించి వివరించానని.. దీనిపై సీఎం నారాయణస్వామి సంతృప్తి వ్యక్తం చేసినట్లు వెల్లడించారు. పాండిచ్చేరిలోనూ రూ.300 మందులు ఉచితంగా అందించేందుకు చర్యలు తీసుకుంటామని సీఎం చెప్పినట్లు ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. కరోనా నిర్ధారణ పరీక్ష ఫలితం వచ్చే వరకు వేచి ఉండకుండా రూ.300 మందులు వాడటంవల్ల మంచి ఫలితాలుంటాయని చెప్పారు.

Related Posts