foreign countries, IPL 2019 venue, BCCI, IPL-12 Matches 

విదేశాలకు తరలిపోనున్న ఐపీఎల్ మ్యాచ్ లు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ఐపీఎల్ టీ20 క్రికెట్ కు ఉన్న క్రేజే వేరు. ఎప్పటినుంచో సొంతగడ్డపై పలు ఎడిషిన్లతో ప్రేక్షకులను అలరిస్తు వస్తోన్న పొట్టి ఫార్మాట్ క్రికెట్ మరోసారి విదేశాలకు తరలిపోనుంది. ఈ ఏడాది ఐపీఎల్ మ్యాచ్ లు విదేశాల్లో జరిగే అవకాశాలు ఉన్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఐపీఎల్ టీ20 క్రికెట్ కు ఉన్న క్రేజే వేరు. ఎప్పటినుంచో సొంతగడ్డపై పలు ఎడిషన్లతో ప్రేక్షకులను అలరిస్తు వస్తోన్న పొట్టి ఫార్మాట్ క్రికెట్ ముచ్చటగా మూడోసారి విదేశాలకు తరలిపోనుంది. ఈ ఏడాది ఐపీఎల్ మ్యాచ్ లు విదేశాల్లో జరిగే అవకాశాలు ఉన్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఐపీఎల్ సమరం ప్రారంభమయ్యే నాటికి లోక్ సభ ఎన్నికలు కూడా రానున్నాయి. అందుకే ఐపీఎల్ టోర్నమెంట్ ను ఈసారి విదేశీ గడ్డపై నిర్వహించే యోచనలో బీసీసీఐ ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం. అదే జరిగితే.. 12వ ఎడిషన్ టీ20 క్రికెట్ మ్యాచ్ లను ప్రత్యక్షంగా వీక్షించే అవకాశాలు క్రికెట్ అభిమానులు కోల్పోయినట్టే. ఇటీవల బీసీసీఐ పెద్దలకు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ అధికారులతో జరిగిన సమావేశమే ఈ ఊహాగానాలకు తావిస్తోంది. గతంలో ఐపీఎల్ టీ20 టోర్నమెంట్ రెండుసార్లు విదేశాల్లో నిర్వహించారు.

2009లో ఒకసారి.. 2014లో రెండోసారి..  
అప్పుడు కూడా సార్వత్రిక ఎన్నికల కారణంగానే విదేశాలకు ఐపీఎల్ వేదికలను తరలించారు. 2009లో తొలిసారి సౌతాఫ్రికా వేదికగా ఐపీఎల్ టీ20 జరిగింది. రెండోసారి 2014లో యూఏఈ వేదికగా ఐపీఎల్ టీ20 మ్యాచ్ లు తరలివెళ్లాయి. 2008లో ఐపీఎల్ ను ప్రవేశపెట్టిన బీసీసీఐ అప్పటినుంచి దేశంలోని పలు క్రికెట్ స్టేడియాల్లో మ్యాచ్ లు నిర్వహిస్తూ వస్తోంది. ఈసారి 12వ ఎడిషన్ ఐపీఎల్ టీ20 టోర్నమెంట్ కు మళ్లీ విదేశాలు వేదికగా నిలువనున్నాయి. ఇటీవల బీసీసీఐ అధ్యక్షుడు రాహుల్ జోహ్రీ ఐపీఎల్ ఎనిమిది ఫ్రాంచైజీలకు సంబంధించి మ్యాచ్ లు భారత్ లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. కానీ, అదే తేదీల్లో జనరల్ ఎలక్షన్లు జరిగే అవకాశాలు ఉండటంతో భద్రత దృష్ట్యా ఐపీఎల్ మ్యాచ్ ల వేదికలను విదేశాలకు తరలించాలని ప్రభుత్వం సూచించినట్టు జోహ్రీ తెలిపారు. అయితే ఇప్పటివరకూ విదేశాల్లో ఈ ఏడాది ఐపీఎల్ మ్యాచ్ ల నిర్వహణపై బీసీసీఐ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. 

జస్టిస్ లోథా సూచనల ప్రకారం..  
ఎన్నికలతో పాటు వరల్డ్ కప్ మ్యాచ్ లు కూడా ఈ ఏడాది ఐపీఎల్ మ్యాచ్ లకు అడ్డుగా నిలిచాయి. ఇంగ్లాండ్ వేదికగా మే 30 నుంచి జూలై 14 వరకు ప్రపంచ కప్ మ్యాచ్ లు జరగునన్నాయి. సాధారణంగా ప్రతి ఏడాది ఐపీఎల్ మ్యాచ్ లు ఏప్రిల్ మొదటివారంలో ఆరంభమై మే చివరి వారంలో ముగియడం సంపద్రాయం. కానీ, ఈసారి అలా జరిగే అవకాశాలు కనిపించడం లేదు. జస్టిస్ లోథా కమిటీ సంస్కరణల ప్రకారం.. ఐపీఎల్ మ్యాచ్ లు నిర్వహించాలంటే.. ఏ ఇతర అంతర్జాతీయ మ్యాచ్ లకు, ఐపీఎల్ మ్యాచ్ లకు మధ్య 15 రోజుల వ్యవధి తప్పనిసరి.

READ  విదేశాలకు వెళ్తే డబల్ డబ్బులిస్తాం: బీసీసీఐ

మార్చి చివరివారంలో ఐపీఎల్..
అందుకే వరల్డ్ కప్ మ్యాచ్ లతో క్లాష్ కాకుండా ఉండేలా ఈసారి ఐపీఎల్ -12 ఎడిషన్ టోర్నమెంట్ మార్చి చివరి వారంలో ప్రారంభం కానున్నాయి. అంటే మే నెల మధ్యలోనే ఐపీఎల్ ముగియనుంది. అదే సమయంలో ఇక్కడ సార్వత్రిక ఎన్నికల నగారా మోగనుంది. దీని దృష్ట్యా బీసీసీఐ బోర్డు.. ఒకవేళ ఐపీఎల్ మ్యాచ్ లను విదేశాలకు తరలించాల్సి వస్తే మాత్రం అందుకు అనుగుణమైన మూడు విదేశీ వేదికలైన సౌతాఫ్రికా, యూవీఈ, ఇంగ్లాండ్ లో నిర్వహించనున్నట్టు క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. 

Related Posts