Golden Ramayanam : 19 కిలోల బంగారంతో తయారు చేసిన 530 పేజీల రామాయణం ..!

19 కిలోల బంగారం,10కిలోల వెండి, వజ్రాలు, కెంపులు, పచ్చలు,నీలాల వంటి రత్నాలతో తయారు చేసిన 530 పేజీల రామాయణం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది..!

Golden Ramayanam : 19 కిలోల బంగారంతో తయారు చేసిన 530 పేజీల రామాయణం ..!

530 pages golden Ramayana in Surat

Golden Ramayanam : రామాయణం అంటే సీతారాముల చరిత్ర మాత్రేమే కాదు..రాముని మార్గం..సమాజానికి మార్గదర్శకం. అటువంటి రామాయణాన్ని ఎంతమంది రచించినా రామనామం ..రాముని గొప్పతనం చాటుతుంది. అటువంటి రామాయణాన్ని బంగారంతో తయారు చేశారు. శ్రీరామ నామ నవమి సందర్భంగా వజ్రాలు, బంగారం, వెండితో తయారు చేసిన రామాయణాన్ని చూడాలంటే గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ లోని ఓ దేవాలయానికి వెళ్లాల్సిందే..19కిలోల బంగారంతో ఈ రామాయణాన్ని తయారు చేశారు.

సూరత్ అంటేనే వజ్రాల వ్యాపారాలకు నెలవు. అటువంటి సూరత్ లోని ఓ దేవాలయంలో బంగారంతో తయారు చేసిన రామాయణం భక్తులను ఆకట్టుకుంటోంది. బంగారు రామాయణం అంటే దాంట్లో అక్షరాలు బంగారంతో ఉంటాయా? అని అనుకోవచ్చు. నిజమే ఈ బంగారు రామాయణంలో అక్షరాలను బంగారంతోనే రూపొందించారు. ఈ రామాయణంలో ఉన్న అక్షరాలను 19 కిలోల బంగారంతో తయారు చేశారు..!!

Hindu University of America : అమెరికాలో హిందూ తత్వశాస్త్ర సిద్ధాంతాలు బోధించే వర్సిటీకి రూ.8.20 కోట్లు విరాళం ఇచ్చిన వ్యాపారవేత్త

ఈ బంగారు రామాయణ రచనకు 530 పేజీలను ప్రత్యేకంగా జర్మనీ నుంచి తెప్పించి 222 తులాల బంగారు ఇంకుతో అక్షరాలను రచించారు. బంగారంతో పాటు 10కిలోల వెండి,4,000 వజ్రాలు,ఇంకా కెంపులు, పచ్చలు వంటి నవరత్నాలతో ఈ బంగారు రామాయణాన్ని తయారు చేశారు. అలా బంగారం, 10కిలోల వెండి,వజ్రాలు, కెంపులు, పచ్చలు,నీలాలు అన్నీ కలిపి ఈ రామాయణ మొత్తం 19 కిలోల బరువుతో రూపొందించారు.దీంతో ఈ రామాయణం విలువ మార్కెట్లో కోట్ల రూపాయాలు ఉంటుంది.ఇన్ని రకాలుగా రూపొందించిన ఈ రామాయణాన్ని శ్రీరామ నవమి సందర్భంగా విశ్వహిందూ పరిషత్ (వీహెచ్ పీ) చేపట్టిన భారీ ఊరేగింపులో ప్రదర్శించారు. ఈ అపురూపమైన రామాయణాన్ని చూసి తరించిన భక్తులు పులకించిపోయారు.

ఈ అపురూపమైన రామాయణం రచనకు 1981లో రామ్ భాయి అనే భక్తుడు పుష్యమీ నక్షత్రంలో శ్రీకారం చుట్టారు. దీన్ని పూర్తి చేయటానికి 9 నెలల 9 గంటల సమయం పట్టిందట. ఈ రామాయణంలో శ్రీరాముడి పేరును 50 మిలియన్ల సార్లు ప్రస్తావించటం జరిగింది. ఈ మహాకావ్యం పూర్తి కావటానికి 12మంది భక్తులు సహాయ సహకారాలు అందించారు. శ్రీరామనవమి రోజున మాత్రమే భక్తుల దర్శనం కోసం ప్రదర్శించనున్నారు ఆలయ నిర్వాహకులు. ఆ తరువాత ఈ రామాయణాన్ని సంవత్సరం అంతా బ్యాంకు లాకర్ లో భద్రపరుస్తామని ఆలయ నిర్వాహకులు తెలిపారు.

Ram Ramapati Bank : ఆ ‘బ్యాంక్‌లో శ్రీరామ నామాలే డిపాజిట్లు’ .. ఆ చెట్టుతో చేసిన పెన్నుతో రామనామాలు రాయాలట,రాముడి బ్యాంకు పూర్తి విశేషాలు

కాగా..ఈ రామాయణ రచన కోసం జర్మనీ నుంచి తెప్పించిన 530 పేపర్లు చాలా ప్రత్యేకమైనవి. చాలా నాణ్యమైనవి. వాటిని నీటితో కడిగినా ఏమీ పాడవ్వవు అలాగే ..బంగారు సిరా అలాగే ఏమాత్రం చెక్కు చెదరకుండా ఉంటుంది. కాగితం పదే పదే తాకినా మరకలు కూడా పడవని రామ్ భాయ్ భక్త బంధువు గున్నవంత్ భాయ్ తెలిపారు.