ఆ గ్రామంలో 40 సంవత్సరాల తర్వాత బోనాల పండుగ

నాగర్ కర్నూలు జిల్లా కోడేరు మండలం ఎత్తం గ్రామంలో 40 సంవత్సరాల తర్వాత బోనాల పండుగ ఉత్సవాలు నిర్వహించారు.

  • Published By: veegamteam ,Published On : August 28, 2019 / 03:11 PM IST
ఆ గ్రామంలో 40 సంవత్సరాల తర్వాత బోనాల పండుగ

నాగర్ కర్నూలు జిల్లా కోడేరు మండలం ఎత్తం గ్రామంలో 40 సంవత్సరాల తర్వాత బోనాల పండుగ ఉత్సవాలు నిర్వహించారు.

తెలంగాణలో బోనాల పండుగను ఘనంగా నిర్వహిస్తారు. ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో బోనాలు ప్రారంభం అవుతాయి. హైదరాబాద్ లో ఆషాఢంలో బోనాల పండుగను జరుపుకుంటారు. గోల్కొండలో మొదలయ్యే బోనాల పండుగ.. చార్మినార్ లాల్ దర్వాజ బోనాలతో ముగుస్తాయి. నగరంలో బోనాలు ముగిశాక రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో శ్రావణ మాసంలో బోనాలు ఉత్సవాలను నిర్వహిస్తారు. 

నాగర్ కర్నూలు జిల్లా కోడేరు మండలం ఎత్తం గ్రామంలో బోనాల పండుగ ఉత్సవాలను గ్రామ ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. 40 సంవత్సరాల తర్వాత బోనాల పండుగ ఉత్సవాలు వైభవంగా జరిగాయని గ్రామ ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. గ్రామప్రజలంతా భక్తి శ్రద్ధలతో పోచమ్మ తల్లికి నైవేద్యం సమర్పించారు. ఉత్సవాల్లో చిన్నారులు, మహిళల నృత్యాలు అందరిని ఆకటుకున్నాయి.

Also Read : పొలం పనులకెళ్లిన మహిళపై మాజీ ఉప సర్పంచ్‌ అత్యాచారం