Holi 2023: హోలీ తేదీపై గందరగోళం.. సోషల్ మీడియాలో నెటిజన్ల మీమ్‌ల వర్షం ..
దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఈరోజు హోలీ పండుగ జరుపుకుంటుండగా.. మరికొందరు 8వ తేదీన హోలీ వేడుకలు జరుపుకొనేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో హోలీ తేదీపై స్పష్టత లేకపోవటంతో సోషల్ మీడియాలో నెటిజన్లు మీమ్స్‌తో హల్‌చల్ చేస్తున్నారు.

Holi 2023: హోలీ పండుగ వచ్చిందంటే దేశం మొత్తం రంగుల మయంగా మారుతుంది. ఎక్కడ చూసిన చిన్నారుల నుంచి పెద్దల వరకు రంగులు చల్లుకుంటూ హోలీ సంబురాల్లో మునిగితేలుతారు. అయితే ఈసారి హోలీ ప్రజల్లో గందరగోళాన్ని నింపింది. హోలీ పండుగను కొందరు 7వ తేదీన జరుపుకుంటుండగా.. మరికొందరు 8వ తేదీన హోలీ పండుగ జరుపుకోవాలని పేర్కొంటున్నారు. ఈ క్రమంలో అసలు ఎప్పుడు హోలీ జరుపుకోవాలో అర్థంకాని పరిస్థితి.
Holi 2023: భారతదేశంలో కాకుండా ఏఏ దేశాల్లో హోలీ జరుపుకుంటారో తెలుసా?
దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఈరోజు హోలీ పండుగ జరుపుకుంటుండగా.. మరికొందరు 8వ తేదీన హోలీ వేడుకలు జరుపుకొనేందుకు సిద్ధమవుతున్నారు. హిందూ క్యాలెండర్ ప్రకారం.. ‘భద్రకాల’ సూర్యాస్తమయం సమయంతో సమానంగా ఉంటుంది. దీంతో కొంతమంది మార్చి 6న హోలీకా దహనం చేసి, మార్చి7న హోలీ పండుగను జరుపుకుంటున్నారు. మరికొందరు మార్చి 7న హోలికా దహనంలో పాల్గొని, 8వ తేదీన హోలీ పండుగను జరుపుకునేందుకు సిద్ధమవుతున్నారు. మహారాష్ట్రతో పాటు పలు రాష్ట్రాల్లో ఈ రోజు హోలీ వేడుకలు జరుపుకుంటున్నారు. పలు రాష్ట్రాల్లో 8వ తేదీన హోలీ పండుగను జరుపుకునేందుకు సిద్ధమవుతున్నారు.
Akhir hai Kab Holi… pic.twitter.com/jhJ86WKrfN
— Ankit Pathak ?? (@ankit_acerbic) March 4, 2023
హోలీ పండుగ తేదీపై స్పష్టమైన సమాచారం లేకపోవటంతో సోషల్ మీడియాలో నెటిజన్లు మీమ్స్‌తో హల్‌చల్ చేస్తున్నారు. ‘హోలీ కబ్ హై..? కబ్ హై హోలీ?’ అంటూ తమదైన శైలిలో మీమ్స్ రూపంలో నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. మొత్తానికి హోలీ తేదీపై గందరగోళం నెలకొనడంతో.. ప్రతీయేటా ఒకేరోజు జరగాల్సిన రంగుల పండుగ.. ఈ ఏడాది దేశంలో రెండు రోజులు జరగనుంది.
?? kab hai #holi Holi kab hai tarak Mehta ka ulta chashma @dipakjoshi @jethalalnumber2 pic.twitter.com/jq6eHEmLsw
— Nemichand Paliwal (@Nemichand__RAS) March 1, 2023
Kab hai #Holi ? pic.twitter.com/hpncskD2AN
— Vivek ?? (@Vibgyyor) March 6, 2023
Kab Hai #Holi Yaar ? pic.twitter.com/D09lqcoeqW
— Samrat Bhai (@BhaiiSamrat) March 6, 2023
Holi kab hai..kab hai holi? pic.twitter.com/ifOAdEbTzN
— Saree_ka (@Naadaan_Chhori) March 6, 2023