Dasra 2021 : ఇంద్రకీలాద్రిపై భక్తుల కిటకిట…చివరి భక్తునికి కూడా అమ్మవారి దర్శనం

దసరా మహోత్సవాలకు చివరి రోజు కావడంతో.. అమ్మవారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. చివరి భక్తునికి కూడా దర్శనం కల్పించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్.

10TV Telugu News

Indrakeeladri : విజయవాడ ఇంద్రకీలాద్రికి భక్తులు పోటెత్తారు. దసరా మహోత్సవాలకు చివరి రోజు కావడంతో.. అమ్మవారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. 2021, అక్టోబర్ 15వ తేదీ శుక్రవారం అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. విజయదశమి సందర్భంగా ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకుంటే అన్ని విజయాలు చేకూరతాయని భక్తుల విశ్వాసం. దీంతో ఉదయం నుంచే వేలాదిగా భక్తులు తరలివస్తున్నారు.

Read More : CM Jagan : ఎక్కడా కరెంటు కోతలు ఉండొద్దు, సీఎం జగన్ ఆదేశం

వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా దేవాలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకున్నారు దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌. దసరా ఉత్సవాలు ఘనంగా జరిగాయని ఆయన తెలిపారు. తొమ్మిది రోజుల పాటు నిత్యం క్యూలైన్లు, ఏర్పాట్లను పర్యవేక్షించామన్నారు. అన్ని శాఖల అధికారులు చక్కగా పనిచేశారని, భక్తులందరూ అమ్మవారిని సంతృప్తిగా దర్శించుకుంటున్నారని వెల్లడించారు మంత్రి వెల్లంపల్లి.

Read More : Teppotsavam : అమ్మవారు తెప్పోత్సవం రద్దు..ఫంట్ మీదే పూజలు

కృష్ణా నదిలో వరద ఉధృతి ఎక్కువగా ఉండడం కారణంగా దుర్గామల్లేశ్వర స్వామివార్ల నదీవిహారం రద్దు చేశామని పేర్కొన్నారు. సాయంత్రం తెప్పోత్సవాన్ని స్వల్ప మార్పులతో నిర్వహిస్తున్నామని తెలిపారు మంత్రి వెల్లంపల్లి. చివరి భక్తునికి కూడా అమ్మవారి దర్శనం కల్పించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌.

×