TTD : తిరుమలలో ఏప్రిల్‌‌‌లో జరిగే విశేష పర్వదిన వివరాలు

తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో ఏప్రిల్ నెల‌లో జ‌రుగ‌నున్న విశేష ప‌ర్వ‌దినాల వివ‌రాలు...తాజా నిర్ణయాలతో ఏప్రిల్ నెలలో శ్రీవారి దర్శనాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది...

TTD : తిరుమలలో ఏప్రిల్‌‌‌లో జరిగే విశేష పర్వదిన వివరాలు

Ttd April 2022

Tirumala April : ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన తిరుమలకు భక్తులు పోటెత్తుతున్నారు. కరోనా వైరస్ నుంచి మెల్లిమెల్లిగా ప్రజలు ఊపిరిపీల్చుకుంటున్నారు. పాజిటివ్ కేసులు గణనీయంగా తగ్గుముఖం పడుతుండడంతో తిరుమలలో నిబంధనలు మార్చివేశారు. భక్తులకు అన్నీ అవకాశాలు కల్పిస్తోంది టీటీడీ. వరుసగా శుభవార్తలు చెబుతోంది. మళ్లీ సాధారణ పరిస్థితులు తీసుకొచ్చేందుకు టీటీడీ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో నిత్యం తిరుమల సందడి సందడిగా మారుతోంది. గోవింద నామస్మరణతో మారుమోగుతోంది. భారీ సంఖ్యలో భక్తులు వస్తుండడంతో అలిపిరి వద్ద రద్దీ నెలకొంటోంది. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీలు చేయాల్సి ఉండడంతో వాహనాలు బారులు తీరుతున్నాయి. మరోవైపు ప్రతి నెలలో తిరుమలలో జరిగే విశేష పర్వదినాలను ముందే తెలియచేస్తోంది టీటీడీ. కొద్ది రోజుల్లో మార్చి నెల ముగుస్తుడడంతో ఏప్రిల్ నెలలో జరిగే విశేష పర్వదినాలను వెల్లడించింది టీటీడీ.

Read More : TTD : మూడు నెలల శ్రీవారి ప్రత్యేక దర్శన టికెట్లు రిలీజ్

తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో ఏప్రిల్ నెల‌లో జ‌రుగ‌నున్న విశేష ప‌ర్వ‌దినాల వివ‌రాలు :-
– ఏప్రిల్ 2న శ్రీ శుభ‌కృత్ నామ సంవ‌త్స‌ర ఉగాది, శ్రీ‌వారికి ఉగాది ఆస్థానం. – ఏప్రిల్ 3న మ‌త్స్య‌జ‌యంతి. – ఏప్రిల్ 10న శ్రీ‌రామ‌న‌వ‌మి ఆస్థానం. – ఏప్రిల్ 12న స‌ర్వ ఏకాద‌శి.
– ఏప్రిల్ 14 నుండి 16వ తేదీ వ‌ర‌కు వ‌సంతోత్స‌వాలు. – ఏప్రిల్ 26న శ్రీ భాష్య‌కారుల ఉత్స‌వారంభం. – ఏప్రిల్ 29న మాస‌శివ‌రాత్రి. – ఏప్రిల్ 30న స‌ర్వ అమావాస్య‌.

Read More : TTD : తిరుమల కిటకిట.. వీకెండ్ రష్

మరోవైపు… తిరుమల శ్రీవారి ఆలయంలో అంగప్రదిక్షణ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన టోకెన్లను ఏప్రిల్ 01వ తేదీన జారీ చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ప్రకటించిన సంగతి తెలిసిందే. కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో తిరుమలలో అంగ ప్రదిక్షణ టోకెన్ల జారీని నిలిపివేసింది. తాజా నిర్ణయాలతో ఏప్రిల్ నెలలో శ్రీవారి దర్శనాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.