Vijayawada : దుర్గగుడిలో కోవిడ్ నిబంధనలు బేఖాతర్, సామాన్య భక్తుల ఇబ్బందులు

వీవీఐపీలకు మాత్రమే అంతరాలయంలోకి అనుమతి ఉంది. కానీ వీవీఐపీలు కాని వారిని అంతరాలయంలోకి దేవస్థానం సిబ్బంది తోడ్కోని వెళుతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.

Vijayawada : దుర్గగుడిలో కోవిడ్ నిబంధనలు బేఖాతర్, సామాన్య భక్తుల ఇబ్బందులు

Indrakeeladri

Indrakeeladri Temple : విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మను దర్శించుకొనేందుకు భక్తులు నిత్యం పెద్ద సంఖ్యలో తరలివస్తుంటారనే సంగతి తెలిసిందే. పండుగ సమయంలో ప్రధానంగా..దసరా సందర్భంగా…ఈ రద్దీ..విపరీతంగా ఉంటుంది. మొదట సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యతనిస్తామని అధికారులు చెబుతున్నా…అందుకు తగ్గట్టు చర్యలు చేపట్టడం లేదనే విమర్శలు ప్రతిసారి వినిపిస్తుంటాయి. ప్రస్తుతం దసరా పండుగ సందర్భంగా…కోవిడ్ నిబంధనలు నడుమ భక్తులను దర్శనానికి అనుమతినిస్తామని ఆలయ అధికారులు వెల్లడించిన సంగతి తెలిసిందే. కానీ..కోవిడ్ నిబంధనలు బేఖాతర్ అవుతున్నాయని తెలుస్తోంది.

Read More : Heavy Rains : హైద‌రాబాద్ లో నేటి మ‌ధ్యాహ్నం భారీ వ‌ర్షాలు

వీవీఐపీలకు మాత్రమే అంతరాలయంలోకి అనుమతి ఉంది. కానీ వీవీఐపీలు కాని వారిని అంతరాలయంలోకి దేవస్థానం సిబ్బంది తోడ్కోని వెళుతున్నారని, 300 రూపాయల టికెట్ వారికి బయటి నుంచి మాత్రమే అమ్మవారి దర్శనం కల్పిస్తున్నారని పెదవి విరుస్తున్నారు. అంతరాలయంలో రద్దీతో క్యూ లైన్లలో ఉన్న సామాన్య భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ వ్యవహారంపై శుక్రవారం కలెక్టర్ సీరియస్ అయ్యారు. అయినా…దుర్గగుడిలో అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. ఈ క్రమంలో…దుర్గగుడిలో అధికారుల తీరును దేవాదాయ శాఖ ప్రిన్స్ పాల్ సెక్రటరీ వాణీమోహన్ వాకబు చేశారు.

Read More : East Godavari : ఆ గ్రామంలో ఏం జరుగుతోంది ? ఆగని మరణాలు

అంతరాలయంలో వీవీఐపీలను మాత్రమే అనుమతినిస్తున్నా..రెండు డిపార్ట్ మెంట్లు వద్ద అజమాయిషీ చేస్తున్నారనేది అవాస్తవమని వెల్లడించారు. అంతరాలయంలోకి వీవీఐపీల పేరిట ప్రోటోకాల్ లో లేనివారిని లోపలికి పంపుతున్న దానిపై విచారణ చేపడుతామని..అనంతరం అధికారులపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. అమ్మవారి దర్శనంలో సామాన్య భక్తులకు ఇబ్బందులు కలిగిస్తే..ఉపేక్షించేది లేదని మరోసారి హెచ్చరించారు దేవాదాయ శాఖ ప్రిన్స్ పాల్ సెక్రటరీ వాణీమోహన్.