Holi 2023: భారతదేశంలో కాకుండా ఏఏ దేశాల్లో హోలీ జరుపుకుంటారో తెలుసా?

హోలీ పండుగ వచ్చిదంటే చాలు.. దేశం మొత్తం రంగుల మయంగా మారుతుంది. యువతీ, యువకుల ఆటపాటలతో సందడిగా మారుతుంది. చిన్నారుల నుంచి పెద్దవారి వరకు రంగులు చల్లుకుంటూ హోలీ శుభాకాంక్షలు తెలుపుకోవటం ఆనవాయితీ. భారత దేశం తరహాలోనే ఇతర దేశాల్లో హోలీ సంబురాలు జరుపుకుంటారు. అయితే ఒక్కో దేశంలో ఒక్కో రీతిలో ఈ వేడుకలు ఉంటాయి.

Holi 2023: హోలీ పండుగ వచ్చిదంటే చాలు.. దేశం మొత్తం రంగుల మయంగా మారుతుంది. యువతీ, యువకుల ఆటపాటలతో సందడిగా మారుతుంది. చిన్నారుల నుంచి పెద్దవారి వరకు రంగులు చల్లుకుంటూ హోలీ శుభాకాంక్షలు తెలుపుకోవటం ఆనవాయితీ. దేశంలో చాలా చోట్ల హోలీ ఆడిన తరువాత ఒకరి ఇళ్లకు ఒకరు వెళ్లి హోలీ శుభాకాంక్షలు చెప్పే సాంప్రదాయం కూడా ఉంది. దేశవ్యాప్తంగానేకాక ప్రపంచంలోని పలు దేశాల్లోనూ హోలీ వేడుకలను నిర్వహిస్తారు. అయితే, భాతదేశంలో రంగులతో హోలీ జరుపుకుంటే ఆయా దేశాల్లో వినూత్న రీతిల్లో హోలీ వేడుకలు జరుగుతాయి.

Watermelon festival in Australia

ఆస్ట్రేలియాలో హోలీ తరహా పండుగను ఘనంగా జరుపుకుంటారు. ఈ పండుగ రెండేళ్లకొకసారి వస్తుంది. ఫిబ్రవరి నెలలో పచ్చకాయ పండుగ జరుగుతుంది. ఈ పండుగలో పచ్చకాయలను ప్రజలు ఒకరిపై ఒకరు విసిరి తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తారు.

Holi festival in South Africa

దక్షిణాఫ్రికాలోనూ రంగుల పండుగను ఘనంగా జరుపుకుంటారు. ఆఫ్రికాలో నివసిస్తున్న భారతీయ కమ్యూనిటీ ప్రజలు ఈ పండుగను వైభవంగా జరుపుకుంటారు. రంగులు చల్లుకొని, హోలీ పాటలు పాడుతూ సందడి చేస్తారు.

Festival of Colors in America

అమెరికాలోనూ హోలీని జరుపుకుంటారు. ఇక్కడ ‘ఫెస్టివల్ ఆఫ్ కలర్స్’ అని పిలుస్తారు. భారతీయ సంస్కృతి నుంచి ఇక్కడ ప్రజలు ఈ పండుగను అలవాటు చేసుకున్నాయి. భారతదేశం తరహాలోనే ఇక్కడ హోలీ జరుపుకుంటారు. ఒకరిపై ఒకరు రంగుల పొడిని చల్లుకుంటూ, నృత్యాలు చేస్తూ ఉత్సాహంగా గడుపుతారు.

water festival in Thailand

థాయ్‌లాండ్‌లో హోలీని ‘సోంగ్‌క్రాన్’ అని పిలుస్తారు. ప్రతీయేటా ఏప్రిల్ నెలలో ఈ పండుగను అక్కడి ప్రజలు జరుపుకుంటారు. చల్లటి నీళ్లను ఒకరిపై ఒకరు చల్లుకుంటూ సందడి చేస్తారు. ఇది బౌద్ధ నూతన సంవత్సరాన్ని జరుపుకునే పండుగ.

Water Fight Festival Germany

జర్మనీలోనూ హోలీ తరహాలో ప్రతీయేటా వాటర్ ఫైట్ ఫెస్టివల్ నిర్వహిస్తారు. జర్మనీలోని ఒబెర్‌బాంబ్రక్‌లో ప్రతీ సంవత్సరం దీనిని నిర్వహిస్తారు. వేసవిలో జరుపుకునే ఈ పండుగలో ప్రజలు ఒకరినొకరు వంతెనపైనుంచి నీటి పోరాటంలో పాల్గొంటారు.

 

Orange festival in Italy

ఇటలీలోనూ హోలీలాంటి పండుగ జరుపుకుంటారు. ఇది పోర్చుగల్, ఫ్రాన్స్, స్పెయిన్ మధ్య నారింజపై యుద్ధం తర్వాత ప్రారంభమైంది. ఇప్పుడు ఒకరిపై ఒకరు నారింజ పండ్లను విసురుకునే సరదా పండుగలా మారిపోయింది. ప్రజలు రెండు గ్రూపులుగా విడిపోయి ఒకరిపై ఒకరు నారింజ పండ్ల వర్షం కురిపించుకుంటారు.  అంతేకాక ఉత్తర స్పెయిన్ లో ప్రజలు ఒకరిపై ఒకరు వైన్ విసురుకుంటారు. లా రియోజా ప్రావిన్సులోని హరో నగరంలో ప్రతీ సంవత్సరం హోలీ తరహాలో వైన్ ఫెస్టివల్ జరుగుతుంది. అదేవిధంగా న్యూజిలాండ్ లోనూని వివిధ నగరాల్లో ప్రతీయేటా రంగుల పండుగను జరుపుకునే ఆనవాయితీ ఉంది. పిల్లలు, వృద్ధులు, యువకులు ఒక పార్కులో గుమ్మిగూడి ఒకరి శరీరంపై మరొకరు పెయింటింగ్ పోటీలు నిర్వహిస్తారు. ఇలా పలు దేశాల్లో పలు విధాలుగా హోలీ తరహా పండుగలను నిర్వహిస్తారు.

ట్రెండింగ్ వార్తలు