Dasara Festival 2021 : కరెన్సీ నోట్లతో అమ్మవారికి అలంకరణ

అమ్మవారి మంటపాలను ఏర్పాటు చేసి పూజలు నిర్వహిస్తున్నారు. అయితే..అమ్మవారి మంటలను వెరైటీగా..వినూత్నంగా ఏర్పాటు చేస్తున్నారు.

Dasara Festival 2021 : కరెన్సీ నోట్లతో అమ్మవారికి అలంకరణ

Facebook

Dasara Festival 2021 : దేవీ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. పలు రాష్ట్రాల్లో అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. నవరాత్రుల సందర్భంగా.. ఆలయాలను అందంగా..పూలు, విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఒక్కో రోజు ఒక్కో అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రముఖ అమ్మవారి ఆలయాలకు భక్తులు పోటెత్తుతున్నారు. పలు ప్రాంతాల్లో అమ్మవారి మంటపాలను ఏర్పాటు చేసి పూజలు నిర్వహిస్తున్నారు. అయితే..అమ్మవారి మంటలను వెరైటీగా..వినూత్నంగా ఏర్పాటు చేస్తున్నారు.

Read More : TS RTC Special Buses : దసరా పండగ బస్సులకు టీ.ఎస్.ఆర్టీసీ ప్రత్యేక పాయింట్లు

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారిని వినూత్నంగా అలంకరించడం విశేషం. ఏకంగా నాలుగు కోట్ల నలభై నాలుగు లక్షల నలభై నాలుగు వేల నాలుగు వందల నలభై నాలుగు రూపాయలతో (4,44,44,444) డబ్బులతో అలంకరించారు. కరెన్సీలతో అమ్మవారి మంటపాన్ని అలంకరించడం అందర్నీ ఆకట్టుకొంటోంది. అమ్మవారి దర్శనానికి భక్తులు తరలివస్తున్నారు.

Read More : Dasara Festivities : అన్నపూర్ణా దేవిగా, శ్రీ మహాలక్ష్మిగా భక్తులకు అభయమిస్తున్న జగన్మాత కనకదుర్గమ్మ

అంతేగాకుండా.. వాసవీ కన్యకా పరమేశ్వరీ దేవాలయంలో ఆలయ కమిటీ నిర్వాహకులు రూ. 15 లక్షల 16 వేల డబ్బులతో ప్రత్యేకంగా అలంకరించారు. ప్రజలు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆసిఫాబాద్ జిల్లాలో దుర్గామాత రోజుకో అవతారంలో దర్శనమిస్తున్నారు. కాగజ్ నగర్ పట్టణంలోని అమ్మవారు ఆదివారం శ్రీ మహాలక్ష్మీ దేవీ అవతారంలో దర్శనమిచ్చారు.