Nizamabad : లక్ష్మీదేవికి కోటి రూపాయలతో అలంకరణ

నిజామాబాద్ జిల్లా నందిపేట పాతూర్ లోని ఓంకార రూపిణీ దుర్గాదేవి మండపాన్ని ఏకంగా కోటి రూపాయలతో కరెన్సీ నోట్లతో అలంకరించారు.

Nizamabad : లక్ష్మీదేవికి కోటి రూపాయలతో అలంకరణ

Nzb Ammavaru

Durga Navaratri Decoration Currency : దేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అమ్మవారు ఒక్కోరోజు ఒక్కో అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు ఆలయాలకు తరలివస్తున్నారు. కరోనా నేపథ్యంలో నియమ, నిబంధనల మధ్య భక్తులకు దర్శనానికి అనుమతినిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు ఆలయ నిర్వాహకులు, అధికారులు. ఆలయాలను పూలు, విద్యుత్ దీపాలతో అందంగా అలంకరిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో అమ్మవారి ఆలయ మంటపాలను వినూత్నంగా తీర్చిదిద్దుతున్నారు.

Read More : Plane Crash : అమెరికాలో కుప్పకూలిన విమానం..ఇద్దరు మృతి

కరెన్సీ నోట్లతో అమ్మవారి మంటపాలను అలంకరించడం హైలెట్ గా మారిపోతోంది. తెలంగాణ రాష్ట్రంలోని లక్షలు, కోట్ల రూపాయలతో తీర్చిదిద్దుతున్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో నాలుగు కోట్ల నలభై నాలుగు లక్షల నలభై నాలుగు వేల నాలుగు వందల నలభై నాలుగు రూపాయలతో (4,44,44,444) డబ్బులతో అలంకరించారు. వాసవీ కన్యకా పరమేశ్వరీ దేవాలయంలో ఆలయ కమిటీ నిర్వాహకులు రూ. 15 లక్షల 16 వేల డబ్బులతో ప్రత్యేకంగా అలంకరించారు.

Read More : Dasara Festival Vijayawada : సరస్వతి దేవి అలంకారంలో బెజవాడ దుర్గమ్మ-దర్శనం కోసం క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులు

తాజాగా…నిజామాబాద్ జిల్లా నందిపేట పాతూర్ లోని ఓంకార రూపిణీ దుర్గాదేవి మండపాన్ని ఏకంగా కోటి రూపాయలతో కరెన్సీ నోట్లతో అలంకరించారు. సోమవారం దుర్గాదేవీ లక్ష్మీదేవీ రూపంగా కొలుస్తూ…మండపం నిండా…అలంకరించారు. ఇక్కడ భక్తులు పోగు చేసిన..నోట్లతో మండపం నిండా ఏర్పాట్లు చేశారు. రూ. 10 నోటు నుంచి…రూ. 2 వేల నోటు వరకు ఇందులో ఉన్నాయి. ప్రతి సంవత్సరం కొంత మొత్తాన్ని పెంచుతూ…కరెన్సీతో అలంకరిస్తూ..వస్తున్నామని నిర్వాహకులు చెప్పారు. కోటి రూపాయల వరకు అలంకరించడంతో..భక్తులు చూడటానికి తరలివస్తున్నారు. ఇక్కడ అమ్మవారు ప్రతి రోజు..ఒక్కో అవతారంలో..ఒకో రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు.