Tiruchanoor Brahmotsavam 2021: గజ వాహనంపై శ్రీమహాలక్ష్మీ అలంకారంలో శ్రీ పద్మావతి అమ్మవారు

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజైన శనివారం రాత్రి విశేషమైన గజ వాహనంపై శ్రీ‌మహాలక్ష్మీ అలంకారంలో అమ్మవారు దర్శనమిచ్చారు. ఆల‌యం వ‌ద్ద‌ గ‌ల వాహ‌న మండ

Tiruchanoor Brahmotsavam 2021: గజ వాహనంపై శ్రీమహాలక్ష్మీ అలంకారంలో శ్రీ పద్మావతి అమ్మవారు

Gaja Vahana Seva At Tiruchanoor

Tiruchanoor Brahmotsavam 2021 :  తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజైన శనివారం రాత్రి విశేషమైన గజ వాహనంపై శ్రీ‌మహాలక్ష్మీ అలంకారంలో అమ్మవారు దర్శనమిచ్చారు. ఆల‌యం వ‌ద్ద‌ గ‌ల వాహ‌న మండ‌పంలో రాత్రి 7 నుండి 8 గంట‌ల వ‌ర‌కు అమ్మ‌వారి వాహ‌న‌సేవ ఏకాంతంగా జ‌రిగింది.

శ్రీ పద్మావతి అమ్మవారికి ఎంతో ప్రీతిపాత్రమైనది గజ వాహనం. గజపటాన్ని ఆరోహణం చేయడంతోనే అమ్మవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. గజం ఐశ్వర్యసూచకం. అందుకే ”ఆగజాంతగం ఐశ్వర్యం” అని ఆర్యోక్తి. పాలసంద్రంలో ప్రభవించిన సిరులతల్లికి గజరాజులు భక్తితో అభిషేకించాయని వేదాంతదేశికులు శ్రీస్తుతి చేశారు. నిద్ర లేవగానే ఐశ్వర్యానికి ప్రతీక అయిన ఏనుగును దర్శించడం వల్ల భోగభాగ్యాలు అభివృద్ధి అవుతాయి. ఏనుగు ఓంకారానికీ, విశ్వానికీ సంకేతమని చెబుతారు.
Also Read : Amaravathi Farmers : 17న తిరుపతిలో భారీ బహిరంగ సభ.. అనుమతి కోరిన అమరావతి రైతులు
ఈరోజు సాయంత్రం జరిగిన వాహనసేవలో శ్రీశ్రీశ్రీ  పెద్దజీయ‌ర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయ‌ర్ స్వామి, చంద్రగిరి ఎమ్మెల్యే డా.చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఈఓ డాక్టర్ కెఎస్.జవహర్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గోన్నారు.

కాగా…… ముంబైకి చెందిన శంకర్ నారాయణ అనే భక్తుడు శనివారం తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారికి రూ.6 లక్షల విలువైన బంగారు ఆభరణాలను విరాళంగా అందించారు. ఈ ఆభరణాలను ఆలయంలో అధికారులకు అందజేశారు.