Namakkal Sree Anjaneyar Temple : నామక్కల్ ఆంజనేయస్వామిని దర్శిస్తే శత్రుశేషం, గ్రహ బాధలనేవి ఉండవు | Namakkal Sree Anjaneyar Temple

Namakkal Sree Anjaneyar Temple : నామక్కల్ ఆంజనేయస్వామిని దర్శిస్తే శత్రుశేషం, గ్రహ బాధలనేవి ఉండవు

తమిళనాడు రాష్ట్రంలో నామక్కల్ జిల్లా నామక్కల్ లోని ఆంజనేయస్వామి దేవాలయం చాలా ప్రసిద్ది  చెందింది. ఇక్కడ అనేక చారిత్రక   విశేషాలు  ఉన్నాయి.

Namakkal Sree Anjaneyar Temple : నామక్కల్ ఆంజనేయస్వామిని దర్శిస్తే శత్రుశేషం, గ్రహ బాధలనేవి ఉండవు

Namakkal Sree Anjaneyar Temple : తమిళనాడు రాష్ట్రంలో నామక్కల్ జిల్లా నామక్కల్ లోని ఆంజనేయస్వామి దేవాలయం చాలా ప్రసిద్ది  చెందింది. ఇక్కడ అనేక చారిత్రక   విశేషాలు  ఉన్నాయి.  ఇక్కడ ఉండే నిలువెత్తు ఆంజనేయ స్వామి దాదాపు 20అడుగుల ఎత్తు ఉంటుంది. ఈ ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది. ఆంజనేయ స్వామి ఎదురుగా ఉన్న లక్ష్మీ నరసింహ స్వామికి చేతులు జోడిస్తూ దాస్యభావాన్ని ప్రకటిస్తుంటారు. ఈ ఆంజనేయ స్వామి గర్భగుడికి పైకప్పు లేదు . అందుకు ఆశ్చర్యకరమైన కారణాలు చెప్పారు స్దానికులు.. ఆ విశేషాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం….

ఈ ఆలయంలో స్వామి విగ్రహం ఎత్తు రోజు రోజుకూ పెరుగుతోందని అంటారు. ఎదురుగా ఉన్న లక్ష్మీ నరసింహుని గర్భాలయానికి పైకప్పు లేనందువల్ల.  గతంలో పైకప్పు వేయాలని ప్రయాత్నాలు జరిగాయి… కానీ వేసిన కప్పు వేసినట్టుగానే కూలిపోయాయని చెబుతున్నారు ప్రదాన అర్చకులు. ఈ విగ్రహం స్వయంభువు అయినందునే రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నారని అందువల్లే పైన కప్పు వేయడానికి వీలుకాలేదని ఆలయ చెపుతుంటారు.  నిత్యం వేల సంఖ్యలో భక్తులు ఈయన్ను దర్శించుకుంటారు. ఆయన కరుణ ఉంటే శత్రుశేషం,గ్రహ దోషం నుండి ఎలాంటి సమస్యలు ఉండవని భక్తుల నమ్మకం.

ఈ దేవాలయం సుమారు 1500 ఏళ్ల నాటిది. నామక్కల్ కోట దిగువ భాగంలో ఈ గుడి ఉంది. నరసింహ స్వామి ఆలయానికి సుమారు వంద మీటర్లు ఎదురుగా ఉంటుంది ఈ గుడి. ఈ దేవాలయంలో ప్రధాన ఆకర్షణ ఆంజనేయ విగ్రహం. ఈ విగ్రహం చాలా ప్రసిద్ధి చెంది నమక్కల్ హనుమాన్‌గా పిలువబడుతుంది. ఆంజనేయుడు దిగంబర దేవాలయంలో (ఆకాశం పైకప్పుగా)  లక్ష్మీ నృసింహ స్వామి మరియు సాలగ్రామం వైపు తిరిగి కొలుస్తూ ఉంటాడు.  స్వామి వారి విగ్రహం సుమారు 18అడుగుల పై మాటే ఉంటుంది. ఆంజనేయుడి విగ్రహం నరసింహస్వామి మూర్తికి అభిముఖంగా ఉండటం విశేషం.

ఆంజనేయుడి కన్ను లక్ష్మీ నరసింహ స్వామి పాదాలతో (పాద పద్మాలు) సరళ రేఖలో ఉంటుంది.  ఆంజనేయుడి విగ్రహం ఇక్కడి కోటకు రక్షకునిగా ఉంటుందని, అక్కడి ప్రజలను శత్రువుల నుండి రక్షిస్తుందని చెబుతుంటారు స్థానికులు. ఆంజనేయుడు స్వామి యొక్క పాదపద్మాలను దర్శించుకోవడాన్ని నేటికీ గరుడాళ్వార్ సన్నిథి నుండి గమనించవచ్చు. కమలాలం చెరువు మెట్ల మీద ఆంజనేయ స్వామి పాదముద్రలను గమనించవచ్చు.

నామగిరి కొండలపై ఉన్న నామక్కల్ కోటను 16వ శతాబ్ధంలో రామచంద్ర నాయకర్ నిర్మించారు. ఈ కోటలో ప్రస్తుతం పురాతనమైన విష్ణు ఆలయ శిథిలాలు కూడా ఉన్నాయి. నామక్కల్ దుర్గం కోట సుమారు ఒకటిన్నర ఎకరం వరకూ ఉంటుంది.  ఈ కోటకు నైరుతి భాగంలో మొట్లు ఉన్నాయి. నామగిరి హిల్స్‌కు ఇరువైపులా ఉన్న గుహలో నరసింహస్వామి, రంగనాథ స్వామి ఆలయాలున్నాయి. కొండరాయితో చెక్కబడిన విగ్రహాలు కావటంతో నేటికి అవి చెక్క చెదరకుండా ఉన్నాయి.

ఈ కొండలలో ఎనిమిది కొలనులు ఉన్నాయి. వీటిలో తామర పువ్వులు పెరుగుతాయి. ఈ దుర్గంలో కొంత కాలం టిప్పు సుల్తాన్ బ్రిటిష్ వారికి కనపడకుండా తలదాచుకున్నాడని చెపుతారు. తర్వాత కాలంలో ఈ కోటను బ్రిటిష్ వారు వశం చేసుకున్నారట. ఇక్కడి అద్భుతమైన శిల్పకళ ఉంది. ఈ ప్రదేశానికి మళ్లీ మళ్ళీ సందర్శించేలా చేస్తాయి.  స్వామికి ప్రతి ఏడాది మార్గశిర నెల తొలి నక్షత్రం రోజున జయంతి వేడుకలను నిర్వహిస్తారు. స్వామి వారి చల్లని దీవెనలు మనపై పడితే చాలు జీవితం సుఖసంతోషాలతో వర్ధిల్లుతుంది అని భక్తుల విశ్వాసం.

 

×