Holi 2023 : రంగుల హోలీ .. మానసిక ఉల్లాసాన్ని పెంచే ఆనందాల ‘కేళీ’

ప్రకృతి ఎంతటి మానసిక ఒత్తిడినైనా ఇట్టే మాయం చేస్తుంది. ప్రకృతి అంటేనే రంగులు. హోలీ అంటే రంగుల కేళి. అంటే ప్రకృతి హోలీ రెండూ ఒక్కటే. ప్రకృతిలో మమేకమైపోయిన రంగులు మానసిక ప్రశాంతతను కలిగిస్తాయని మానసిక నిపుణులు చెబుతున్నారు. ప్రకృతిపరంగా సహజంగా తయారు చేసిన రంగులతో హోలీ ఆడితే మానసిక ఒత్తిడి తగ్గిపోతుందని మానసిక ఉల్లాసం కలుగుతుందని చెబుతున్నారు నిపుణులు.

Holi 2023 : ప్రకృతి ఎంతటి మానసిక ఒత్తిడినైనా ఇట్టే మాయం చేస్తుంది. ప్రకృతి అంటేనే రంగులు. హోలీ అంటే రంగుల కేళి. అంటే ప్రకృతి హోలీ రెండూ ఒక్కటే. ప్రకృతిలో మమేకమైపోయిన రంగులు మానసిక ప్రశాంతతను కలిగిస్తాయని మానసిక నిపుణులు చెబుతున్నారు. ప్రకృతిపరంగా సహజంగా తయారు చేసిన రంగులతో హోలీ ఆడితే మానసిక ఒత్తిడి తగ్గిపోతుందని మానసిక ఉల్లాసం కలుగుతుందని చెబుతున్నారు నిపుణులు. హోలీ అంటే పండుగ. పండుగ అంటేనే సంబరం. అందరు కలిసి ఆడుకునే ఆట హోలీ..అటువంటి హోలీ మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తుందని చెబుతున్నారు నిపుణులు. హోలీ కేళిలో భాగంగా మనం వాడే ముదురు రంగులు, ఆడే సరదా ఆటలు మన మనసులోని ఒత్తిళ్లు, ఆందోళనల్ని దూరం చేసి మానసికోల్లాసాన్ని పెంపొందిస్తాయంటున్నారు నిపుణులు. మరి ఏఏ రంగులతో ఎటువంటి ఉపయోగాలో తెలుసుకుందాం.

కొన్ని రంగుల్ని చూడగానే మనలో ఒక ప్రశాంతమైన భావన కలుగుతుంది. రంగుల్లో ముఖ్యంగా ఎరుపు, పసుపు,తెలుపు, ఆకుపచ్చ రంగులు మనలో సానుకూల ఆలోచనల్ని రేకెత్తిస్తాయని..నీలం, గులాబీ.. వంటి రంగులు మనసులోని ఒత్తిళ్లను దూరం చేసి ప్రశాంతతను అందిస్తాయని పలు అధ్యయనాలు కూడా రుజువు చేశాయి. హోలీ ఆటల్లో మనం ఉపయోగించే విభిన్న రకాల రంగులు మన భావోద్వేగాల్ని నియంత్రించి మనసుకు సంతోషాన్ని అందించడంతో పాటు శరీరంలో కొత్త శక్తిని కలుగుజేస్తాయని చెబుతున్నారు నిపుణులు..

ఒకరిద్దరు కలిసి హోలీ ఆడుతుంటే వారిని చూసి ఎంతోమంది వారితో కలిసి ఆడుతుంటారు.కుటుంబ సభ్యులతో పాటు బంధువులు, స్నేహితులతో పాటు ఇరుగుపొరుగువారు కూడా వారితో పాటు కలుస్తారు. రంగులు చల్లుకుంటూ ఆడపాటల్లో తేలిపోతారు. అప్పటివరకు పరిచయంలేకపోయినా హోలీ అందరిని స్నేహితులుగా మార్చేస్తుంది. రంగులు చల్లుకుంటూ స్నేహితులైపోతారు.. ఇలా హోలీ పండుగ ఒంటరితనాన్ని దూరం చేసి కొత్త స్నేహితుల్ని పరిచయం చేస్తుంది.

మనసుకు నచ్చిన పనులు చేస్తే సంతోషంగా అనిపిస్తుంది. దీనికి కారణం శరీరంలో హ్యాపీ హార్మోన్లు విడుదలవడమే కారణమంటున్నారు మానసిక నిపుణులు. హోలీ పండుగ ఆటలతో ఈ సంతోషం పెరుగుతుందంటున్నారు. అందరితో కలిసి రంగుల హోలీ కేళీలో భాగమవడం, ముదురు రంగుల ప్రభావం, మరింత ఉత్సాహాన్ని కలిగించే సంగీతానికి డ్యాన్సులు వేయటం ఇవన్నీ మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని చెబుతున్నారు నిపుణులు.

ఈ ఆటల్లో మన శరీరంలో సెరటోనిన్‌, డోపమైన్‌, ఎండార్ఫిన్లు, ఆక్సిటోసిన్‌.. అనే హ్యాపీ హార్మోన్లు విడుదలవుతాయి. దీంతో మనసులోని ప్రతికూల ఆలోచనలు, యాంగ్జైటీ.. వంటివి దూరమై..మనసు ప్రశాంతంగా, ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉంటుంది. అంతేకాదు కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి..ఏకాగ్రత పెరుగుతుంది. దీంతో కష్టమైన పనులను కూడా ఇష్టంగా చేయగలుగుతాం. ఇష్టంగా చేసే ఏ పని అయినా మంచి ఫలితాలనిస్తుంది. సో..రంగుల కేళిలో తేలిపోండీ..మానసిక ఉల్లాసాన్ని పెంచుకోండి..

ట్రెండింగ్ వార్తలు