నాగుల చవితి: పుట్టలో పాలు పోసే ముందు ఇలా..

  • Published By: veegamteam ,Published On : October 31, 2019 / 05:02 AM IST
నాగుల చవితి: పుట్టలో పాలు పోసే ముందు ఇలా..

నాగుల చవితి దీపావళి వెళ్ళిన నాలుగో రోజున కార్తీక చతుర్ధి నాడు వస్తుంది. కార్తీక శుద్ధ చతుర్థిని నాగుల చవితి పండుగ అంటారు. ఈ పండుగ రోజు నాగ దేవతను ప్రసన్నం చేసుకునేందుకు పుట్టలో పాలు పోస్తారు. నాగదేవతను ఆరాధిస్తూ.. తాము, తమ కుటుంబసభ్యులు సుఖసౌఖ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటూ స్త్రీలు పుట్టలో పాలు పోస్తారు.

పాలతో పాటు పండ్లుఫలాలు, నువ్వులు, కోడిగుడ్డు కూడా పుట్టలో వేస్తారు. ఈ పండుగను స్త్రీలు ఉపవాసంతో ఉండి నిర్వహిస్తారు. ఈ పండుగను ఒక్కొక్కరూ ఒక్కోలా జరుపుకుంటారు. కొన్ని ప్రాంతాల్లో నాగదేవత విగ్రహాన్ని పెట్టి పూజిస్తారు. కొన్ని ప్రాంతాల్లో పాముపుట్ట ఉన్న ప్రాంతానికి వెళ్ళి అక్కడ పూజ చేస్తారు. పుట్ట దగ్గర శుభ్రం చేసి, నీళ్ళు జల్లి, ముగ్గులు వేసి, పసుపు కుంకుమలు జల్లి, పూలతో అలంకరిస్తారు. తర్వాత పుట్టలో నైవేద్యం విడిచి, నాగదేవతకు నమస్కరించుకుంటారు.

ఇక నాగదోషం ఉన్నవారు నాగుల చవితి నాడు తప్పక పుట్టలో పాలు పోస్తారు. నాగదోష పోడానికి పూజలు చేస్తారు. నాగదోషాన్ని తొలగించి, సుఖసంతోషాలు ప్రసాదించమని నాగదేవతను వేడుకుంటారు.  

ఈ 9 నాగుపాముల పేర్లూ చెప్పి పుట్టలో పాలు వేయాలి..

ఓమ్ అనంత నాగాయ నమః 
ఓమ్ శేష  నాగాయ నమః
ఓమ్ వాసుకి నాగాయ నమః
ఓమ్ తక్షక నాగాయ నమః
ఓమ్ కులుకి నాగాయ నమః
ఓమ్ కర్కోటక  నాగాయ నమః
ఓమ్ శంఖ పాల నాగాయ నమః
ఓమ్ పద్మనాభాయ నమః 
ఓమ్ మహపద్మ నాబాయ నమః