TTD : తిరుమలలో ఫుల్ రష్, బారులు తీరిన వాహనాలు

టీటీడీ నిర్ణయంతో సర్వదర్శనం భక్తులకు రోజుకు అదనంగా 2 గంటల దర్శన సమయం లభిస్తుంది. శని, ఆదివారాలు సెలవు దినం కావడంతో భక్తులు భారీగా తిరుమలకు పోటెత్తారు. కొండపైకి వచ్చేవారి సంఖ్య...

TTD : తిరుమలలో ఫుల్ రష్, బారులు తీరిన వాహనాలు

Ttd

Huge Devotees Rush at TTD : తిరుపతిలో దాదాపు 22 నెలల తర్వాత భక్తుల రద్దీ అమాంతంగా పెరిగింది. కరోనా వైరస్ ఉధృతి తగ్గడంతో భక్తుల విషయంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకొంది. 40 వేల టోకెన్లు జారీ చేస్తున్నారు. 60 వేల మంది శ్రీవారిని దర్శించుకోవడానికి భక్తులు తరలివస్తున్నారు. వీఐపీ బ్రేక్ దర్శనంపై టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. శని, ఆదివారాల్లోనూ వీఐపీ బ్రేక్ దర్శనం రద్దు చేశారు. ఇప్పటికే శుక్రవారం వీఐపీ రద్దు చేశారు. వీఐపీల కోసం కేటాయించిన సమాయాన్ని కూడా సామాన్య భక్తులకు కేటాయించాలని టీటీడీ నిర్ణయించింది.

Read More : TTD : శ్రీవారి హుండీ ఆదాయం రూ. 5.41 కోట్లు, శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు

టీటీడీ నిర్ణయంతో సర్వదర్శనం భక్తులకు రోజుకు అదనంగా 2 గంటల దర్శన సమయం లభిస్తుంది. శని, ఆదివారాలు సెలవు దినం కావడంతో భక్తులు భారీగా తిరుమలకు పోటెత్తారు. కొండపైకి వచ్చేవారి సంఖ్య క్రమంగా పెరుగుతుండడంతో.. అలిపిరి చెక్‌పోస్టు వద్ద వాహనాలు భారీగా నిలిచిపోయాయి. సొంత వాహనాలు, ఇతరత్రా వాహనాల్లో తిరుమలకు చేరుకుంటున్నారు. దీంతో అలిపిరి ప్రాంతం వద్ద వాహనాలు బారులు తీరి నిలిచిపోతున్నాయి. తనిఖీలు ఆలస్యం అవుతుండడంతో భక్తులు గంటల పాటు వెయిట్ చేయాల్సి వస్తోంది. తనిఖీలు ఆలస్యం అవుతుండడంతో వాహనాల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని అదనపు సిబ్బందిని ఏర్పాటు చేసి తనిఖీలు వేగవంతం చేయాలని భక్తులు కోరుతున్నారు.

Read More : TTD Tickets Online: శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఆన్‌లైన్ టికెట్లు విడుదల!

కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తుండడంతో తిరుమలకు వచ్చే భక్తుల విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకుంది. గతంలో భక్తులను ఎవరినీ తిరుమలకు అనుమతించలేదనే విషయం తెలిసిందే. ఇప్పుడు వైరస్ ఉధృతి తగ్గుముఖం పడుతుండడంతో భక్తుల విషయంలో టీటీడీ నిర్ణయాలు తీసుకొంటోంది. భారీ సంఖ్యలో భక్తులు తిరుమలకు విచ్చేస్తున్నారు. అలిపిరి నడక మార్గంలో కూడా భక్తుల రద్దీ పెరిగింది. నిత్యం ఐదు నుంచి ఆరు వేల మంది నడుచుకుంటూ కొండపైకి వస్తున్నట్లు తెలుస్తోంది. రెండు రోజుల పాటు ఇదే విధంగా రష్ ఉంటుందని టీటీడీ విజిలెన్స్ అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.