Huge Devotess Rush In Tirumala : తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 48గంటలకు పైగా సమయం

కలియుగ వైకుంఠం తిరుమలకు భక్తులు పోటెత్తారు. తిరుమల భక్త జన సంద్రంగా మారింది. ఇసుక వేస్తే రాలనంత జనం వచ్చారు. ఐదు రోజులుగా వరుస సెలవులు, వివాహాల నేపథ్యంలో భక్తులు తిరుమలకు అధికంగా తరలివస్తున్నారు. శనివారం రాత్రి నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు.

Huge Devotess Rush In Tirumala : తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 48గంటలకు పైగా సమయం

Huge Devotess Rush In Tirumala : కలియుగ వైకుంఠం తిరుమలకు భక్తులు పోటెత్తారు. తిరుమల భక్త జన సంద్రంగా మారింది. ఇసుక వేస్తే రాలనంత జనం వచ్చారు. ఐదు రోజులుగా వరుస సెలవులు, వివాహాల నేపథ్యంలో భక్తులు తిరుమలకు అధికంగా తరలివస్తున్నారు. శనివారం రాత్రి నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు.

Tirumala : రద్దీ దృష్ట్యా తిరుమల యాత్ర వాయిదా వేసుకోండి-టీటీడీ విజ్ఞప్తి

వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్ మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. 6 కిలోమీటర్లకు పైగా క్యూలైన్లలో భక్తులు బారులు తీరారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్, నారాయణ గిరి షెడ్లు, క్యూలైన్లు సేవసదన్ దాటి రింగ్ రోడ్ వరకు భక్తుల క్యూలైన్ చేరింది. దీంతో పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల భక్తులతో కిటకిటలాడుతోంది. భక్తుల రద్దీ అనూహ్యంగా పెరగడంతో శ్రీవారి దర్శనానికి 36 గంటలకు పైగా సమయం పడుతోంది. భక్తులు క్యూలైన్లలో గంటల తరబడి వేచి ఉన్నారు. అన్ని కంపార్టుమెంట్లు నిండిపోయాయి వెలుపల క్యూ కట్టారు. దీంతో క్యూలైన్లలో భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదు.

Tirumala Brahmotsavalu 2022 : తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. బ్రహ్మోత్సవాలకు మాస్క్ మస్ట్

చంటి పిల్లలతో వచ్చిన వారు, వృద్ధులు అవస్థలు పడుతున్నారు. మరోవైపు శ్రీవారి దర్శనానికి 48 గంటలకు పైగా సమయం పడుతోందని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. భక్తుల రద్దీకి అనుగుణంగా తమ ప్రయాణ ఏర్పాట్లు చేసుకోవాలని, లేదంటే తిరుమల పర్యటనను వాయిదా వేసుకోవాలని టీటీడీ అధికారులు సూచించారు.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

కాగా.. తిరుమ‌ల‌కు వ‌చ్చే భ‌క్తులంద‌రికీ వ‌స‌తి ఏర్పాటు చేయ‌డం క‌ష్ట‌మ‌ని టీటీడీ అధికారులు చెప్పారు. భ‌క్తులు తిరుప‌తిలోనే వ‌స‌తి పొంది, త‌మ‌కు కేటాయించిన స్లాట్ ప్ర‌కారం ద‌ర్శ‌నానికి రావాల‌న్నారు. ఇక శ్రీవారి బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 27 నుండి జరుగనున్నాయి. భక్తులకు సంతృప్తికరంగా మూలమూర్తి దర్శనంతోపాటు వాహనసేవలు వీక్షించే అవకాశం కల్పించేందుకు తగిన ఏర్పాట్లు చేపడుతున్నట్టు టీటీడీ అధికారులు తెలిపారు. సెప్టెంబర్‌ 27 నుంచి అక్టోబర్‌ 5 వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఇందులో ప్రధానంగా సెప్టెంబర్‌ 27న ధ్వజారోహణం, అక్టోబర్ 1న గరుడ సేవ, అక్టోబర్‌ 2న స్వర్ణరథం, అక్టోబర్‌ 4న రథోత్సవం, అక్టోబర్‌ 5న చక్రస్నానం నిర్వహిస్తారు.

కరోనా కారణంగా రెండేళ్ల తర్వాత మాడ వీధుల్లో శ్రీవారి బ్రహ్మోత్సవ వాహనసేవలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ సర్వదర్శనం మాత్రమే ఉంటుంది. రూ.300 ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నం, వృద్ధులు, విక‌లాంగులు, చంటి పిల్లల త‌ల్లిదండ్రుల‌కు ఇచ్చే అన్ని రకాల ప్రివిలేజ్డ్‌ దర్శనాలు రద్దు చేశారు. బ్రహ్మోత్సవాల్లో తొలి రోజైన సెప్టెంబర్‌ 27న ముఖ్యమంత్రి జగన్‌ రాష్ట్ర ప్రభుత్వం తరఫున తిరుమల శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు.