TTD SVBC : ఎస్వీబీసీ కన్నడ, హిందీ ఛానల్స్ కు కేంద్రం అనుమతి

తిరుమల తిరుపతి దేవస్ధానముల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రముఖ ఆధ్యాత్మిక భక్తి ఛానల్ శ్రీవెంకటేశ్వర భక్తి ఛానల్ (ఎస్వీబీసీ) కన్నడ, హిందీ ఛానెల్స్‌కు కేంద్రం లైసెన్స్ మంజూరు చేసింది.

TTD SVBC : ఎస్వీబీసీ కన్నడ, హిందీ ఛానల్స్ కు కేంద్రం అనుమతి

Ttd Svbc

TTD SVBC : తిరుమల తిరుపతి దేవస్ధానముల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రముఖ ఆధ్యాత్మిక భక్తి ఛానల్ శ్రీవెంకటేశ్వర భక్తి ఛానల్ (ఎస్వీబీసీ) కన్నడ, హిందీ ఛానెల్స్‌కు కేంద్రం లైసెన్స్ మంజూరు చేసింది. ఇప్పటికే తెలుగు, తమిళ భాషల్లో పలు హిందూ ఆధ్యాత్మిక కార్యక్రమాలు, శ్రీవారి సేవల ప్రత్యక్ష ప్రసారాలను, హిందూ ధర్మ ప్రచారాన్ని భక్తులకు అందిస్తున్న టీటీడీ కన్నడ, హిందీల్లో కూడా ప్రసారాలను ప్రారంభించనుంది.

2020 డిసెంబర్ 10న టీటీడీ ఎస్వీబీసీ-3కన్నడ, ఎస్వీబీసీ-4 హిందీకి అనుమతులు ఇవ్వాలని కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు లేఖ పంపింది. దీంతో మంత్రిత్వ శాఖ కన్నడ, హిందీ ఛానళ్లకు అనుమతి ఇవ్వటానికి ఒక్కోదానికి రూ.కోటి బ్యాంకు గ్యారెంటీని నెల రోజుల్లో పంపాలని టీటీడీకి లేఖ రాసింది. ఒక్కో ఛానల్‌‌కు అప్‌ లింకింగ్‌, డౌన్‌ లింకింగ్‌ అనుమతి కోసం రూ.7 లక్షలు వంతున మొత్తం రూ.14 లక్షలు చెల్లించాలని అని కూడా తెలిపింది. టీటీడీ ఈ మొత్తం చెల్లించటంతో కేంద్రం అనుమతులు మంజూరు చేసింది.
Also Read : TikTok Couple : టిక్ టాక్ వీడియోలతో ఫేమస్…రూ.44 లక్షల కుచ్చు టోపి పెట్టిన దంపతులు

ఇటీవలే హైదారాబాద్ కు చెందిన ఒక భక్తుడు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ కు రూ.4 కోట్ల 20లక్షల రూపాయలు విరాళం అందించాడు. ఈ విరాళంతో ఎస్వీబీసీ నూతన కెమెరాలనుకొనుగోలు చేస్తామని ప్రకటించింది.