Pavitrostavam : ఇంద్రకీలాద్రిపై పవిత్రోత్సవాలు..ఎప్పటి నుంచి అంటే

ఇంద్రకీలాద్రిపై పవిత్రోత్సవాలు నిర్వహించేందుకు ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. 2021, ఆగస్టు 21వ తేదీ నుంచి ఈ ఉత్సవాలు జరుగనున్నాయి. మొత్తం మూడు రోజుల పాటు నిర్వహించనున్నారు.

Pavitrostavam : ఇంద్రకీలాద్రిపై పవిత్రోత్సవాలు..ఎప్పటి నుంచి అంటే

Indrakeeladri

Indrakeeladri : ఇంద్రకీలాద్రిపై పవిత్రోత్సవాలు నిర్వహించేందుకు ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. 2021, ఆగస్టు 21వ తేదీ నుంచి ఈ ఉత్సవాలు జరుగనున్నాయి. మొత్తం మూడు రోజుల పాటు నిర్వహించనున్నారు. ఆగస్టు 21వ తేదీన తెల్లవారుజామున 3 గంటలకు అమ్మవారికి స్వపనాభిషేకం, పవిత్రమాలధారణ జరుగనుంది.

Read More : Vedalam Telugu remake: క్రేజీ కాంబినేషన్.. మెగాస్టార్ చెల్లిగా మహానటి ఫిక్స్!

ఉదయం 9 గంటల నుంచి సర్వదర్శనానికి భక్తులను అనుమతించనున్నారు. 23వ తేదీన మహా పూర్ణాహుతితో ఈ పవిత్రోత్సవాలు ముగియనున్నాయని దుర్గగుడి అధికారులు వెల్లడించారు. 21వ తేదీ నుంచి మూడు రోజుల పాటు జరిగే ఈ పవిత్రోత్సవాల సందర్భంగా దేవస్ధానంలో జరిగే అన్ని ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు.