Yadadri Temple : యాదాద్రి ఆలయ విమాన గోపురానికి కడప జిల్లా జెడ్పీటీసీ కిలో బంగారం విరాళం

యాదాద్రి ఆలయ పునః నిర్మాణంలో భాగంగా గర్భాలయ విమాన గోపురానికి అద్భుతమైన స్వర్ణ తాపడం చేయించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.

Yadadri Temple : యాదాద్రి ఆలయ విమాన గోపురానికి కడప జిల్లా జెడ్పీటీసీ కిలో బంగారం విరాళం

Yadadri Vimana Gopuram

Yadadri Temple :  యాదాద్రి ఆలయ పునః నిర్మాణంలో భాగంగా గర్భాలయ విమాన గోపురానికి అద్భుతమైన స్వర్ణ తాపడం చేయించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.  ఈ పుణ్యకార్యంలో ప్రతి ఒక్కరిని భాగస్వాములను చేయాలనినిర్ణయించుకున్నారు. ఈ బృహత్కార్యానికి  సుమారు 125 కిలోల బంగారం అవసరం అవుతుంది. అందుకు సుమారు రూ. 60 కోట్లు ఖర్చవుతుంది. అందులో భాగంగా దాతల నుంచి విరాళాలు సేకరిస్తున్నారు. స్వామి వారి భక్తులు ఎవరైనా సరే రూ.11 ఇచ్చినా తీసుకుంటామని నిన్న సీఎం చెప్పారు.

భక్తులు ఎంత ఇచ్చినాదాన్ని బంగారం కొనే డబ్బులో కలిపికొంటాం అని ఆయన వివరించారు. కేసీఆర్ ఇచ్చిన పిలుపుతో తెలంగాణ నుంచే కాక ఏపీ నుంచి విరాళాలు ఇచ్చేందుకు  భక్తులు ముందుకు వస్తున్నారు. ఇందులో భాగంగా వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన వ్యాపారవేత్త, చిన్న మండెం జెడ్పీ టీసీ మోడెం జయమ్మ తన కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఒక కిలో బంగారాన్ని దేవాలయానికి విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు.

Also Read : Yadadri Temple : యాదాద్రి వైభవాన్ని చాటేలా పునర్‌ నిర్మాణం

సీఎం కేసీఆర్ పిలుపు మేరకు తాను తన కుటుంబ సభ్యులు కలిసి దేవాలయానికి విరాళంగా కిలో బంగారాన్ని ఇస్తామని తెలిపారు.  ఇందుకు సంబంధించిన చెక్కును యాదాద్రి ల‌క్ష్మీ న‌ర‌సింహ స్వామి స‌న్నిధిలో  త్వరలో  అంద‌జేస్తాన‌ని ఆమె తెలిపారు. యాదాద్రి ఆల‌య పునఃనిర్మాణానికి సంబంధించిన ఈ మ‌హ‌త్త‌ర కార్య‌క్ర‌మంలో భాగ‌స్వామ్యం చేసినందుకు సీఎం కేసీఆర్‌కు జయమ్మ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.