Brahmotsavam : కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల షెడ్యూల్ ఇదే!

చిత్తూరు జిల్లా శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 20వ తేదీ నుంచి 28వ తేదీ వరకు జరుగుతాయి.

Brahmotsavam : కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల షెడ్యూల్ ఇదే!

Brahmotsavam

Brahmotsavam 2022 : చిత్తూరు జిల్లా శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 20వ తేదీ నుంచి 28వ తేదీ వరకు జరుగుతాయి.  ఫిబ్రవరి 19వ తేదీ సాయంత్రం అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభ‌మ‌వుతాయి. ప్రతిరోజు ఉద‌యం గం.8 నుండి గం. 9 గంట‌ల వ‌ర‌కు,  రాత్రి గం.7 నుండి గం. 8ల వ‌ర‌కు ఏకాంతంగా వాహ‌న‌ సేవ‌లు నిర్వ‌హిస్తారని ఆలయ అధికారులు తెలిపారు.

శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఫిబ్రవరి 15వ తేదీ మంగ‌ళ‌వారం ఉదయం 6గంటల నుండి 10 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జ‌రుగ‌నుంది. బ్రహ్మోత్సవాల ముందు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ.

20వ తేదీ ఆదివారం ఉదయం మీనలగ్నంలో ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు మొదలవుతాయి. రాత్రి   పెద్ద శేషవాహనం పై స్వామివారిని ఊరేగిస్తారు.
21వ తేదీ సోమవారం ఉదయం చిన్న శేషవాహాన సేవ జరుగుతుంది.  రాత్రి  హంసవాహన సేవ జరుగుతుంది.
22వ తేదీ మంగళవారం ఉదయం సింహవాహన సేవ…. రాత్రి  ముత్యపు పందిరి వాహాన సేవ జరుగుతుంది.
23వ తేదీ బుధవారం ఉదయం కల్పవృక్ష వాహన సేవ… రాత్రి   సర్వభూపాల వాహన సేవ జరగుతుంది.

24వ తేదీ గురువారం ఉదయం మోహినీ అవతారంలోపల్లకీ ఉత్సవం… రాత్రి   గరుడ వాహన సేవ జరుగుతుంది.
25వ తేదీ శుక్రవారం ఉదయం హనుమంత వాహన సేవ… రాత్రి   స్వర్ణరథం (తిరుచ్చి), గజ వాహన సేవ జరుగుతుంది
26వ తేదీ శనివారం ఉదయం సూర్యప్రభ వాహన సేవ…. రాత్రి   చంద్రప్రభ వాహన సేవ జరుగుతుంది.

27వ తేదీ ఆదివారం ఉదయం సర్వభూపాల వాహనసేవ… రాత్రి   అశ్వవాహన సేవ జరుగుతుంది.
28వ తేదీ సోమ‌వారం ఉదయం చక్రస్నానం నిర్వహిస్తారు… రాత్రి  ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.