Sharana Basaveshwara : శరణ బసవేశ్వర జాతర రథోత్సవానికి భారీగా పోటెత్తిన భక్తులు

కలబురగిలో 18వ శతాబ్దపు పండితుడు,సన్యాసి, ప్రఖ్యాత శరణ బసవేశ్వర జాతర రథోత్సవానికి భక్తులు భారీగా పోటెత్తారు. రథోత్సవ ఊరేగింపులో వేలాదిగా భక్తులు తరలివచ్చి మొక్కులు తీర్చుకున్నారు.

Sharana Basaveshwara : శరణ బసవేశ్వర జాతర రథోత్సవానికి భారీగా పోటెత్తిన భక్తులు

Sharana Basaveshwara

Sharana Basaveshwara : కలబురగిలో 18వ శతాబ్దపు పండితుడు,సన్యాసి, ప్రఖ్యాత శరణ బసవేశ్వర జాతర రథోత్సవాన్ని ఆదివారం భక్తులు భారీగా పోటెత్తారు. భారీగా తరలి వచ్చిన భక్తుల నడుమ బసవేశ్వర జాతర రథోత్సం అంగరంగ వైభవంగా జరిగింది. రథోత్సవ ఊరేగింపులో వేలాదిగా భక్తులు తరలివచ్చి మొక్కులు తీర్చుకున్నారు. సాయంత్రం భారీ జనసందోహం మధ్య నగర వీధుల్లో రథోత్సవాన్ని నిర్వహిస్తున్న దృశ్యాలు కన్నువ పండుగా జరిగాయి. సన్యాసి శరణు బసవేశ్వర 201వ వర్ధంతిని పురస్కరించుకుని కలబురగిలో సోమవారం (మార్చి 12,2023) జరిగిన ‘శరణబసవేశ్వర జాతర’లో భక్తులు భారీగా తరలివచ్చారు.

కర్ణాటకలోని ఈశాన్య భాగంలో ఉన్న పురాతన పట్టణం కల్బుర్గి (గుల్బర్గా)లో శరణ బసవేశ్వర ఆలయం ఉంది. ఇది ప్రఖ్యాతి చెందిన పుణ్యక్షేత్రం. హిందూ మత గురువు, తత్వవేత్త లింగాయత్ శాఖకు చెందిన సన్యాసి అయిన శ్రీ శరణ బసవేశ్వర గౌరవార్థం ఈ ఆలయం నిర్మించబడింది. కర్మ యొక్క పురోగతికి ప్రసిద్ధి చెందిందీ ఆలయం. శరణ బసవేశ్వరుడికి నివాళులు అర్పించటానికి భక్తులు భారీగా తరలివస్తారు. బసవేశ్వరుని సమాధి గర్భగుడి మధ్యలో ప్రతిష్టించబడింది.ఈ ాలయానికి పక్కనే ఉన్న సరస్ు అనేకమంది భక్తులను పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుటుంది. బసవేశ్వర జాతకకు భక్తులు ఆలయానికి పాదయాత్రగా చేరుకుంటారు. ఆ తరువాత బసవేశ్వరుడిని దర్శించుకుంటారు.