Tirumala : తిరుమ‌ల‌లో ల‌క్ష్మీ కాసులహారం శోభాయాత్ర

తిరుమ‌ల‌లో ల‌క్ష్మీ కాసులహారం శోభాయాత్ర కన్నుల పండుగగా జరిగింది. తిరుచానూరు పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలు జరుగుతున్న సంగతి తెలిసిందే.

Tirumala : తిరుమ‌ల‌లో ల‌క్ష్మీ కాసులహారం శోభాయాత్ర

Lakshmi Kasula Haram Procession In Tirumala

Lakshmi Kasula haram : తిరుమ‌ల‌లో ల‌క్ష్మీ కాసులహారం శోభాయాత్ర కన్నుల పండుగగా జరిగింది. తిరుచానూరు పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. 2021, నవంబర్ 30వ తేదీ మంగ‌ళ‌వారం ధ్వజారోహణంతో ప్రారంభమయ్యాయి. తొమ్మిది రోజుల పాటు ఈ ఉత్స‌వాలు జరుగుతాయి. అందులో భాగంగా…శనివారం, ఆదివారాల్లో గజ, గరుడ వాహన సేవలు నిర్వహించనున్నారు. ఈ వాహన సేవలను అలంకరించేందుకు శ్రీవారి లక్ష్మీకాసుల హారాన్ని శనివారం ఉదయం తిరుమల శ్రీవారి ఆలయం నుంచి నాలుగు వీధుల్లో ఊరేగించారు. తిరుమలలో జరిగిన కార్యక్రమంలో…టీటీడీ అద‌న‌పు ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డి, ఆల‌య డిప్యూటీ ఈవో ర‌మేష్‌బాబు, పేష్కార్ శ్రీ‌హ‌రి పాల్గొన్నారు.

Read More : Omicron Threat : కరోనా బారిన పడినవారికి..ఒమిక్రాన్ సోకదనుకుంటే పొరపాటే : పరిశోధకుల వార్నింగ్

అనంతరం తిరుమల నుంచి వాహనంలో భద్రత నడుమ తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి తీసుకొచ్చారు. ఈ హారాన్ని టీటీడీ జేఈవో వీరబ్రహ్మంకు అందచేశారు. అక్క‌డ హారానికి ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించి మంగ‌ళ‌వాయిద్యాల న‌డుమ ఆల‌యంలోకి తీసుకెళ్లారు. ఆల‌య ప్రాంగ‌ణంలో ప్ర‌దిక్షణగా గ‌ర్భాల‌యంలోకి తీసుకెళ్లారు. ఈ కార్య‌క్ర‌మంలో ఆలయ డిప్యూటీ ఈవో క‌స్తూరి బాయి, ఆగమ సలహాదారు, కంక‌ణ‌బ‌ట్టార్‌ శ్రీనివాసాచార్యులు, ఆల‌య అర్చ‌కులు బాబుస్వామి, ఏఈవో ప్ర‌భాక‌ర్ రెడ్డి, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్ రాజేష్‌, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

Read More : Pawan Kalyan Mourned : రోశయ్య మరణం తెలుగు రాష్ట్రాలకు తీరని లోటు : పవన్ కళ్యాణ్

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా…2021, డిసెంబర్ 04వ తేదీ శనివారం ఐదో రోజు పల్లకీపై మోహినీ అలంకారంలో శ్రీ అల‌మేలు మంగ‌ అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. వాహ‌న మండ‌పంలో ఉదయం 8 నుండి 9 గంట‌ల వ‌ర‌కు పల్లకీ ఉత్సవం ఏకాంతంగా జ‌రిగింది. అమ్మ‌వారి బ్ర‌హ్మోత్సవాల్లో డిసెంబ‌రు 4న రాత్రి గ‌జ‌వాహ‌నం, డిసెంబ‌రు 5న రాత్రి గ‌రుడ‌వాహ‌నం, డిసెంబ‌రు 8న పంచ‌మితీర్థం, డిసెంబ‌రు 9న పుష్ప‌యాగం నిర్వ‌హించ‌నున్నారు.