Pitru Paksha 2021 : పెద్దలను స్మరించుకునే మహాలయ పక్షాలు

భాద్రపద మాసంలోని శుక్ల పక్షం దేవతా పూజలకు.... బహుళ పక్షం పితృ దేవతా పూజకు విశిష్టమైనది. పితృదేవతలకు ఇష్టమైన పక్షం కనుక దీనిని పితృపక్షం అంటారు.

Pitru Paksha 2021 : పెద్దలను స్మరించుకునే మహాలయ పక్షాలు

Pitru Paksham

Pitru Paksha 2021 :  భాద్రపద మాసంలోని శుక్ల పక్షం దేవతా పూజలకు…. బహుళ పక్షం పితృ దేవతా పూజకు విశిష్టమైనది. పితృదేవతలకు ఇష్టమైన పక్షం కనుక దీనిని పితృపక్షం అంటారు. అలాగే ఈ పక్షాన్ని మహాలయ పక్షం అని కూడా అంటారు. ఈ ఏడాది మహాలయ పక్షాలు సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 6వ తేదీ వరకు ఉన్నాయి. ఈ రోజుల్లో ఎలాంటి శుభకార్యాలు చేయరు. మహాలయ పక్షంలో ఆచారం ఉన్నవారు యథావిధిగా అన్న సంతర్పణ, పితృ శ్రాద్ధాలు నిర్వర్తించడం చేయవచ్చు.

ఇప్పటి వరకు ఆ అలవాటు లేనివారు కనీసం ఏదైనా దేవాలయంలో పురోహితులకు స్వయంపాకం సమర్పించడం లేదా పేదలకు అన్నదానం చేయడం వల్ల పితృదేవతల ఆశీస్సులతో ఎంతోకాలంగా తీరని కోరికలు తప్పక నెరవేరతాయని విశ్వాసం.  ఎప్పుడో మరణించిన పితృ దేవతలకు తర్పణలు వదలడం, గతించిన పెద్దలను తలచుకుని వారి పేరిట అన్నదానం చేస్తే వారికి కడుపు,  మనకు మనసు నిండుతాయి.
Also Read : Pournami Girivalam : సెప్టెంబర్ పౌర్ణమికి అరుణాచలంలో గిరిప్రదక్షిణకు అనుమతి లేదు

పక్షం మొదటి రోజు నుంచి చివరి రోజు వరకూ పితృ దేవతలకు తర్పణ, శ్రాద్ధ విధులను నిర్వహించాలని పురోహితులు చెబుతున్నారు. ఒకవేళ అలా కుదరనప్పుడు తమ పితృ దేవతలు ఏ తిథినాడు మృతి చెందారో అదే తిథినాడు శ్రాద్ధం నిర్వహించాలి. తండ్రి జీవించి ఉండగా తల్లిని కోల్పోయిన వారైతే ఈ పక్షం నవమి తర్పణ, శ్రాద్ధ విధులను ఆచరించ వచ్చు. ఈ పదిహేను రోజులూ నియమ పూర్వకంగా పితృ దేవతలకు తర్పణాదుల ద్వారా తృప్తి కలిగించాలి.  లేకుంటే మహాలయ అమావాస్య రోజున మాత్రం శ్రాద్ధ విధులను ఆచరించ వచ్చు.

పితురులను తృప్తి పరచే ఈ కర్మల ద్వారా పితృ రుణం తీర్చుకునే అవకాశం ఇది. స్వర్గుస్తు లైన మాతా పితురుల కోసం ప్రతీవారు ఈ పక్షాలలో పితృ కర్మలను ఆచరించాలి. తద్వారా శ్రేయస్సు పొంద గలుగుతారు.
భాద్రపద పూర్ణిమతో అరంభమైన పితృపక్షం, మహాలయ పక్షం ఆ మాసపు అమావాస్యతో ముగుస్తుంది. మహాలయ పక్షము అమావాస్య రోజున గోవులకు గ్రాసము అందించిన ఎడల దేవత లందరూ తృప్తి పడతారంటారు. కావున మీ దగ్గరలో ఉన్న గోశాలలో గ్రాసము అందించి పితృ దేవతల ఆశీస్సులు పొందవచ్చని పెద్దలు చెపుతారు.