Yadadri : విమాన గోపురానికి మంత్రి మల్లారెడ్డి విరాళాల సేకరణ, 11 కిలోల బంగారం

బంగారం తాపడం కోసం మంత్రి మల్లారెడ్డి కూడా..బంగారం విరాళం ఇచ్చారు. మేడ్చల్ నియోజకవర్గంలో ఆయన విరాళాలు సేకరించారు. మొత్తం 11 కిలోల వరకు బంగారం విరాళం ఇస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

Yadadri : విమాన గోపురానికి మంత్రి మల్లారెడ్డి విరాళాల సేకరణ, 11 కిలోల బంగారం

Yadadri Temple

Minister Malla Reddy Donated Gold : తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి పునర్ నిర్మాణ పనులు శరవేగంగ కొనసాగుతున్నాయి. ఆలయంలో విమాన గోపురం ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. దీనికి బంగారం తాపడం చేస్తున్నారు. బంగారం విరాళం ఇవ్వాలని ఆలయ అధికారులు సూచించడంతో..భారీ ఎత్తున విరాళాలు అందిస్తున్నారు. సామాన్యుడి నుంచి మొదలుకుని రాజకీయ నేతలు, ప్రముఖులు కూడా విరాళం ఇస్తున్నారు. బంగారం తాపడం కోసం మంత్రి మల్లారెడ్డి కూడా..బంగారం విరాళం ఇచ్చారు.

Read More : T.Cong : కాంగ్రెస్‌‌లో వర్గ విభేదాలు..కోమటిరెడ్డి ఫ్లెక్సీల చించివేత

ఆయన ఒక కిలో బంగారం ఇచ్చిన సంగతి తెలిసిందే. మేడ్చల్ నియోజకవర్గంలో ఆయన విరాళాలు సేకరించారు. మొత్తం 11 కిలోల వరకు బంగారం విరాళం ఇస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి కుటుంబసభ్యులతో పాటు..నియోజకవర్గ ప్రజలు పూజలు నిర్వహించారు. సేకరించిన విరాళాన్ని ఆలయ అధికారులకు ఆయన అప్పగించనున్నారు. ఈ సందర్భంగా…10tvతో ఆయన మాట్లాడారు. రెండు దఫాలుగా ప్రజల దగ్గరి నుంచి విరాళాలు సేకరించామని, రూ. 3 కోట్ల 26 లక్షలు ప్రజలు స్వచ్చందంగా విరాళాలు ఇవ్వడం జరిగిందన్నారు. విమాన గోపురానికి మళ్ళీ అవకాశం రాదన్న ఆయన…ఇప్పుడే ఇస్తే గోపురానికి ఉపయోగపడుతుందన్నారు. మార్చి 28 తేది యాగంతో యాదాద్రి ఆలయం మొదలు కాబోతోందని..ప్రజలందరూ సహకరించాలన్నారు. తెలంగాణలో ఉన్న ఆలయాలను గత ప్రభుత్వాలు పట్టించుకోలేదని, తెలంగాణ అంటే యాదాద్రి అనే మాదిరిగా సీఎం కేసీఆర్ తీర్చిదిద్దుతున్నారని ప్రశంసించారు.

Read More : Women Warned BJP MLA : మా ఊరికి రోడ్డు వేయకపోతే ‘చెప్పులతో కొట్టి చంపేస్తాం’బీజేపీ ఎమ్మెల్యేకు మహిళల హెచ్చరిక

మరోవైపు..బీజేపీ నేతలపై ఆయన విమర్శలు గుప్పించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పై సీఎ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను సమర్థించారు. ధాన్యం కొనుగోలు చెయ్యమని బండి సంజయ్ ఇప్పటికైనా కేంద్రాన్ని ఒప్పించాలని డిమాండ్ చేశారు. ఎంపీగా ఉన్న బండి సంజయ్ కేంద్రం నుంచి పరిమిషన్ తీసుకురావాలని, హుజురాబాద్ లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బీజీపీకి అమ్ముడు పోయాడని ఆరోపించారు. హుజురాబాద్ బీజేపీది గెలుపు గెలుపే కాదన్న మంత్రి మల్లారెడ్డి…వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ఎవరూ ప్రత్యామ్నాయం కాదని స్పష్టం చేశారు.