Moola Nakshatra : శ్రీశైలంలో అమ్మవారికి మూల నక్షత్ర పూజలు

శ్రీశైల శ్రీభ్రమరాంబ మల్లిఖార్జున స్వామి అమ్మవారి సన్నిధానంలో ప్రత్యేక పూజలు జరిగాయి. సాక్షి గణపతి స్వామి వారికి అభిషేకాలు, పుష్పార్చనలు నిర్వహించారు.

Moola Nakshatra : శ్రీశైలంలో అమ్మవారికి మూల నక్షత్ర పూజలు

Srisailam

Moola Nakshatra Pooja : శ్రీశైల శ్రీభ్రమరాంబ మల్లిఖార్జున స్వామి అమ్మవారి సన్నిధానంలో ప్రత్యేక పూజలు జరిగాయి. లోకకళ్యాన్ని కాంక్షిస్తూ…2021, ఆగస్టు 18వ తేదీ బుధవారం ఈ పూజలు జరిపించడం జరిగిందని ఆళయ ఈవో కేఎస్ రామారావు వెల్లడించారు. మూలా నక్షత్రం సందర్భంగా…శ్రీభ్రమరాంబదేవి అమ్మవారికి పూజలు నిర్వహించిన అనంతరం…ఊయల సేవలో ఆది దంపతులను అధిష్టింపచేశారు. కరోనా వైరస్ లేకుండా చేయాలని అర్చక వేదపండితులు మహా సంకల్పాన్ని పఠించారు.

Read More : E KYC : రేషన్ కార్డులు తొలగింపు, ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన

అంతకుముందు ఉదయం సాక్షి గణపతి స్వామి వారికి అభిషేకాలు, పుష్పార్చనలు నిర్వహించారు పండితులు. సాయంత్రం ఆలయ ప్రాంగణంలోని జ్వాలా వీరభద్ర స్వామి వారికి షోడశోపచార క్రతువులు శాస్త్రోక్తంగా నిర్వహించడం జరిగిందని ఆలయ ఈవో కేఎస్ రామారావు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. స్వామి అమ్మవారి ఆర్జిత సేవలో పాల్గొనేందుకు బారులు తీరారు. మరోవైపు భక్తులకు సర్వదర్శనాలు కల్పించారు.

Read More :వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌పై ‘టాటా’ ఆసక్తికి కారణమేంటి?

2021, ఆగస్టు 18వ తేదీ బుధవారం నుంచి భక్తులు..కోవిడ్ నిబంధనలు పాటిస్తూ..స్వామి వారిని దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ దర్శనాలు మూడు విడతలుగా కేటాయించారు. ఉదయం 7 గంటలకు తొలి విడుత, మధ్యాహ్నం 12 గంటలకు రెండో విడత, రాత్రి 7.30 గంటలకు మూడో విడత బ్రేక్ దర్శనాలకు అనుమతినిస్తున్నారు. బ్రేక్ దర్శనం టికట్ రూ.500 ఉంటుందన్నారు.

Read More : Third Wave : కర్నాటక ప్రభుత్వం మాస్టర్ ప్లాన్… 1.5కోట్ల మంది పిల్లలకు టెస్టులు

ఇక ఆలయానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలు పాటించాల్సి ఉంటుందని దేవస్థానం స్పష్టం చేసింది. మాస్క్ ధరించడం, సామాజిక దూరం తప్పక పాటించాలని వెల్లడించింది. స్వామి, అమ్మవార్ల దర్శనం కోసం వచ్చే భక్తులు సంప్రదాయ దుస్తులు ధరించాల్సి ఉంటుందన్నారు.