Tiruchanoor : పెద్దశేష వాహనంపై శ్రీ ప‌ద్మావ‌తి అమ్మవారు

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో  భాగంగా రెండో రోజైన బుధవారం ఉదయం ఏడు తలలు గల పెద్దశేషవాహనంపై వైకుంఠ‌నాథుని (శ్రీ మహావిష్ణువు) అలంకారంలో శంకుచ‌క్రాలు, గ‌ద

Tiruchanoor :  పెద్దశేష వాహనంపై శ్రీ ప‌ద్మావ‌తి అమ్మవారు

Tiruchanoor Goddess Sri Padmavati

Tiruchanoor :  తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో  భాగంగా రెండో రోజైన బుధవారం ఉదయం ఏడు తలలు గల పెద్దశేషవాహనంపై వైకుంఠ‌నాథుని (శ్రీ మహావిష్ణువు) అలంకారంలో శంకుచ‌క్రాలు, గ‌ద ధరించి అమ్మవారు భక్తులకు అభయమిచ్చారు. కోవిడ్-19 నేపథ్యంలో ఆల‌యం వ‌ద్ద‌గ‌ల వాహ‌న మండ‌పంలో ఉదయం 8 నుండి 9 గంట‌ల వ‌ర‌కు అమ్మ‌వారి వాహ‌న‌సేవ ఏకాంతంగా జ‌రిగింది.
Also Read : Tirumala Ghat Road : కొండచరియలు విరిగి పడటంతో భారీగా దెబ్బతిన్న తిరుమల రెండో ఘాట్ రోడ్డు
శ్రీ పద్మావతి అమ్మ‌వారి కార్తీక బ్రహ్మోత్సవాలలో రెండవ వాహనం పెద్దశేషుడు. లక్ష్మీ సహితుడైన శ్రీవారికి దాసుడిగా, సఖుడిగా, శయ్యగా, సింహాసనంగా, ఛత్రంగా సమయోచితంగా సేవలందిస్తాడు. అభయ వరదహస్తయైన శ్రీవారి పట్టమహిషి అలిమేలు మంగకు వాహనమై తన విశేష జ్ఞానబలాలకు తోడైన దాస్యభక్తిని తెలియజేస్తున్నాడు. సర్పరాజైన శేషుని వాహన సేవ దర్శనం వల్ల యోగశక్తి కలుగుతుంది.