TTD : పంచగవ్య ఉత్పత్తులకు ఫుల్ రెస్పాన్స్.. ఈ కామర్స్ ద్వారా విక్రయాలు

తిరుమ‌ల శ్రీ‌వారి ల‌డ్డూ ప్ర‌సాదంలాగే పంచ‌గ‌వ్య, అగ‌ర‌బ‌త్తీలు, ఫోటో ఫ్రేమ్ త‌దిత‌ర ఉత్ప‌త్తులు కూడా స్వామివారి ప్ర‌సాదాలు గానే భ‌క్తులు భావించేలా చేయ‌డం ద్వారా ఈ - కామ‌ర్స్‌లో...

TTD : పంచగవ్య ఉత్పత్తులకు ఫుల్ రెస్పాన్స్.. ఈ కామర్స్ ద్వారా విక్రయాలు

Ttd

Panchagavya Products : ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన తిరుమలలో టీటీడీ తయారు చేస్తున్న పంచగవ్య ఉత్పత్తులకు ఫుల్ రెస్పాండ్ వస్తోంది. దాదాపు 15 రకాల పంచగవ్య ఉత్పత్తులు, ఆలయంలో ఉపయోగించిన పుష్పాలతో తయారు చేస్తున్న అగర్ బత్తీలు, ఫొటో ఫ్రేమ్ తదితర ఉత్పత్తులను కొనుక్కొనేందుకు భక్తులు ఆసక్తి కనబరుస్తున్నారు. భక్తుల నుంచి వస్తున్న స్పందన చూసి.. ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతోంది. టీటీడీ అగ‌ర‌బ‌త్తీల‌కు భ‌క్తుల నుండి విశేష ఆద‌ర‌ణ ల‌భిస్తోంద‌ని దీనివ‌ల్ల ఉత్ప‌త్తి సామ‌ర్థ్యాన్ని 15 వేల నుండి 30 వేల ప్యాకెట్ల‌కు పెంచ‌డానికి ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయ‌ని టీటీడీ జేఈవో వీరబ్రహ్మం వెల్లడించారు. 2022, ఏప్రిల్ 20వ తేదీ బుధవారం ప‌రిపాల‌న భ‌వ‌నంలోని ఆయన ఛాంబ‌ర్‌లో అధికారులు, జియో ప్లాట్ ఫాం ప్ర‌తినిధులతో స‌మావేశం నిర్వ‌హించారు.

Read More : TTD: “భక్తులు పరిమితికి మించి రావడంతోనే ఇలా జరిగింది”

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఈ – కామ‌ర్స్ ద్వారా పంచ‌గ‌వ్య ఉత్ప‌త్తుల విక్ర‌యాలు చేపట్టనున్నట్లు, దీని ద్వారా ప్ర‌జ‌ల‌కు మ‌రింత చేరువ చేయ‌డానికి స‌హ‌క‌రించాల‌ని సూచించారు. పంచ‌గ‌వ్య, ఫొటో ఫ్రేమ్ త‌దిత‌ర ఉత్ప‌త్తుల‌కు ఈ త‌ర‌హా ఆద‌ర‌ణ ల‌భించేలా చేయ‌డానికి త‌గిన సూచ‌న‌లు, స‌ల‌హాలు ఇవ్వాల‌ని కోరారు. ఇందుకు అవ‌స‌ర‌మైన ప్ర‌చార ప్ర‌ణాళిక‌లు కూడా సూచించాల‌న్నారు. బెంగుళూరు, చెన్నై, వైజాగ్‌, హైద‌రాబాద్ స‌మాచార కేంద్రాల్లో ఈ ఉత్ప‌త్తుల విక్ర‌యాలు జ‌రుగుతున్నాయ‌ని, త్వ‌ర‌లో ఢిల్లీ, భువ‌నేశ్వ‌ర్‌లోని స‌మాచార కేంద్రాల్లో విక్ర‌యాలు ప్రారంభిస్తామ‌న్నారు. ఈ కామ‌ర్స్‌లో విక్ర‌యాల కోసం అవ‌స‌ర‌మైతే స‌మాచార కేంద్రాల‌ను స్టాక్ పాయింట్లుగా కూడా ఉప‌యోగిస్తామ‌న్నారు.

Read More : TTD-Annamaya: అన్నమయ్యను అగౌరపరుస్తున్నామన్న వార్తలు అసత్యం, టీటీడీపై దుష్ప్రచారం తగదు: ఎఇఓ ధర్మారెడ్డి

తిరుమ‌ల శ్రీ‌వారి ల‌డ్డూ ప్ర‌సాదంలాగే పంచ‌గ‌వ్య, అగ‌ర‌బ‌త్తీలు, ఫోటో ఫ్రేమ్ త‌దిత‌ర ఉత్ప‌త్తులు కూడా స్వామివారి ప్ర‌సాదాలు గానే భ‌క్తులు భావించేలా చేయ‌డం ద్వారా ఈ – కామ‌ర్స్‌లో వీటిని భ‌క్తుల‌కు మ‌రింత చేరువ చేయ‌వ‌చ్చ‌ని టీటీడీ ఐటీ స‌ల‌హాదారు అమ‌ర్ తెలిపారు. ఇందుకోసం డిజిట‌ల్ మీడియాలో ప్ర‌చారానికి స‌హ‌క‌రిస్తామ‌ని, అలాగే టీటీడీ ఆఫ్‌లైన్ ద్వారా జ‌రుపుతున్న విక్ర‌యాల‌కు బ్యాంకుల‌ను అనుసంధానం చేసే పీఓఎస్ విధానాన్ని త‌యారు చేసి ఇస్తామ‌న్నారు. ఈ సమావేశంలో అద‌న‌పు ఎఫ్ఎసీఏవో ర‌విప్ర‌సాద్‌, సీఈవో సందీప్ పాల్గొన‌గా జియో ప్లాట్ ఫాం ప్ర‌తినిధులు వ‌ర్చువ‌ల్‌గా హాజ‌ర‌య్యారు.