Yadadri : యాదాద్రిలో మూడు రోజులపాటు పవిత్రోత్సవాలు

యాదాద్రి శ్రీ లక్ష్మి నరసింహస్వామి పుణ్యక్షేత్రంలో మూడు రోజులపాటు పవిత్రోత్సవాలు జరగనున్నాయి. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.

Yadadri : యాదాద్రిలో మూడు రోజులపాటు పవిత్రోత్సవాలు

Yadadri

Yadadri : తెలంగాణ ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మి నరసింహస్వామి ఆలయంలో మంగళవారం నుంచి మూడు రోజులపాటు పవిత్రోత్సవాలు జరగనున్నాయి. ఈ నెల 19 వరకు జరిగే ఈ ఉత్సవాల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు ఆలయ అధికారులు. ఉత్సవాల నిర్వహణ కోసం బలాలయంలో యాగశాలను ఏర్పాటు చేశారు.

కాగా ఏడాది పాటు ఆలయంలో పూజల్లో, భక్తుల నుంచి తెలిసి తెలియక జరిగిన తప్పులు, దోషాలను చెరిగిపోయేందుకు ప్రతి సంవత్సరం పవిత్ర ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. ఈ ఉత్సవాల నేపథ్యంలో సుదర్శన, నారసింహ హోమం, కల్యాణం రద్దు చేసినట్లు ఆలయ అధికారులు చెప్పారు.

ఇదిలా ఉంటే ఆలయాల అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఆలయం చుట్టూ పర్యాటకులను ఆకర్షించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. గతంతో పోల్చుకుంటే భక్తుల రద్దీ పెరిగింది. ప్రతి రోజు సుమారు 10000 మంది స్వామివారిని దర్శించుకుంటున్నట్లుగా తెలుస్తుంది.