Poli Padyami : సింహాచలంలో వైభవంగా పోలి పాడ్యమి

హరిహరులకు ఇష్టమైన కార్తీకమాసం ఎన్నో రకాలుగా విశిష్టమైనది. కార్తీక మాసం ముగింపు సందర్భంగా తెల్లవారుజామున నేతిలో ముంచిన వత్తులతో అరటిదొప్పలులో దీపాలను వెలిగించి భక్తుల నదులు,పుష్కరిణ

Poli Padyami : సింహాచలంలో వైభవంగా పోలి పాడ్యమి

poli padyami

Poli Padyami :  హరిహరులకు ఇష్టమైన కార్తీకమాసం ఎన్నో రకాలుగా విశిష్టమైనది. కార్తీక మాసం ముగింపు సందర్భంగా తెల్లవారుజామున నేతిలో ముంచిన వత్తులతో అరటిదొప్పలులో దీపాలను వెలిగించి భక్తుల నదులు,పుష్కరిణిలలో వదులుతారు. విశాఖ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలంలోని శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం పుష్కరిణిలో కార్తీక మాసం చివరి రోజు పోలి పాడ్యమికి అశేషంగా భక్తులు తరలి వచ్చారు.

సింహాచలం దేవస్థానం కొండ దిగువును ఉన్న పుష్కరిణిలో ప్రతి ఏటా సాంప్రదాయబధ్ధంగా నిర్వహిస్తున్న కార్తీక పోలి పాడ్యమి ఉత్సవానికి ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. భక్తుల తోపులాటలు లేకండా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. తెల్లవారుజాము నుంచే మహిళా భక్తులు పుష్కరిణి వద్దకు చేరుకుని పుష్కరిణిలో దీపాలు విడిచి పోలికి వీడ్కోలు పలుకుతూ పూజలు నిర్వహించారు.