Rakhi Festival : పురాణకాలం నుండి రాఖీ పండుగ…అసలు కధ ఏటంటే?..

'యదో బద్దో బలీరాజా దానవేంద్రో మహాబలా:తేనత్వం అనుబంధామి రక్షమాంచమాంచలం' అంటూ రక్షణ కోరిన తన సోదరిని బలి చక్రవర్తి రక్షిస్తూ ఎలాంటి ఆటంకాలెదురైనా  ధైర్యంతో ఎదురు

Rakhi Festival : పురాణకాలం నుండి రాఖీ పండుగ…అసలు కధ ఏటంటే?..

Raki

Rakhi Festival : ఆత్మీయ అనుబంధాలకు రాఖీ పండుగ ఓ తీపిగుర్తి. అక్కకు తమ్ముడు, అన్నకు చెల్లెలు కష్టాల్లో తోడుగా నిలుస్తామని ఇచ్చే నమ్మకమే ఈ రక్షా భంధన్. తన అన్నకు ఎలాంటి నష్టం రాకూడదని, సమస్యల చిక్కుముడి నుంచి విడుదల కలగాలని, జీవితాంతం సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటూ చెల్లెలు రాఖీని కడుతుంది. తన సంతోషాన్ని కోరుకొని రాఖీ కట్టిన చెల్లిలికి అన్నయ్య ఏదో ఒక కానుకను చెల్లికి బహుకరించి తన అశీస్సులు అందిస్తాడు. దీనినే రాఖీ పౌర్ణమి, శ్రావణ పౌర్ణమి, జంధ్యాల పూర్ణిమగా జరుపుకుంటారు.

ప్రస్తుత యాంత్రిక జీవన విధానంలో మానవీయ సంబంధాలు అంతంతమాత్రంగానే కొనసాగుతున్నాయి. ఈ తరుణంలో ఇలాంటి రాఖీ పౌర్ణమి పండుగలను ఊరువాడలా నిర్వహించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైన ఉంది. సోదర భావాన్ని, స్నేహా బంధాన్ని తెలియజేస్తూ, శాంతి సౌభ్రాతృత్వాలను పరిమళింపజేసేలా రక్షాబంధనాన్ని జరుపుకోవటం అనాదిగా ఆనవాయితీగా వస్తుంది. ఏటా శ్రావణ పౌర్ణమి రోజున దేశవ్యాప్తంగా జరుపుకునే ఈ పండుగను రాఖీ పౌర్ణమిగా కూడా పిలుస్తారు. సంప్రదాయాలు ఉట్టిపడేలా దేశ‌వ్యాప్తంగా రాఖీ పౌర్ణమిని ఘనంగా జరుపుకుంటుంటారు.

రక్షాభంధన్ కు పురాతన చరిత్రకూడా ఉంది. దేవ దానవులకు త్రిలోకాధిపత్యమే లక్ష్యంగా సాగుతున్న యుద్ధంలో రాక్షసుల ధాటికి దేవతలే తల్లడిల్లిపోయారు. అమరావతికి అధిపతిగా ఉన్న దేవేంద్రుడు సైతం ఏమిచేయలేని పరిస్ధితి. ఆసమయంలో దేవేంద్రుడి మౌనాన్ని గమనించిన ఆయన సతీమణి శచీదేవి భర్తను సమాయత్తపర్చాలన్న ఆలోచనతో లయకారుడైన పరమేశ్వ‌రుడిని, లక్ష్మీనారాయణున్ని ఆరాధిస్తుంది. అనంతరం భర్త దేవేంద్రుని చేతికి రక్షా కంకణం కడుతుంది. ఆ ఉత్తేజంతో రాక్షసులతో యుద్ధం చేసి త్రిలోకాధిపత్యం సాధిస్తాడు దేవేంద్రుడు. ఆనాటి శచీదేవితో ప్రారంభమైన రక్షాబంధనం నేటికి ఆచార,సాంప్రదాయంగా కొనసాగుతూ వస్తోంది.

‘యదో బద్దో బలీరాజా దానవేంద్రో మహాబలా:తేనత్వం అనుబంధామి రక్షమాంచమాంచలం’ అంటూ రక్షణ కోరిన తన సోదరిని బలి చక్రవర్తి రక్షిస్తూ ఎలాంటి ఆటంకాలెదురైనా  ధైర్యంతో ఎదురు నిలిచాడు. అటువంటి మహావీరునితో తన సోదరుడిని పోలుస్తూ సోదరి తనకి రక్షణ నివ్వమని కోరుకుటుంది. ఈ పండుగ రక్తం పంచుకుని పుట్టిన సోదరుల మధ్యే కాదు. ఏ బంధుత్వం ఉన్నా లేకపోయినా, ఒక సోదరుడు, సోదరి భావనలతో రాఖీ కట్టడం జరుగుతోంది. కేవలం సోదరీసోదరుల అనుబంధానికి గుర్తుగా మాత్రమే కాకుండా ఆత్మీయుల మధ్య కూడా ఐకమత్యానికి పరస్పర సహకారానికి చిహ్నంగా చేసుకోవడం కనిపిస్తుంది.

రక్షాబంధన్ రోజునే హయగ్రీవ జయంతిని కూడా జరుపుకుంటారు. మరణమే లేకుండా వరం అనుగ్రహించేలా తపస్సు చేసిన ఓ రాక్షసుడిని లక్ష్మీదేవి కటాక్షిస్తుంది. హయగ్రీవ ముఖాకృతి రూపంలో ఉన్న వ్యక్తి నుంచి మాత్రమే మరణం సంభవించేలా ఆ రాక్షసుడిని అనుగ్రహిస్తుంది. వర గర్వంతో దేవతలను ఇబ్బందులు పెడతాడు రాక్షసుడు. చివరికి శివుడు ఉపాయంతో మహావిష్ణువు విల్లుకు బాణాన్ని సంధించి తీవ్ర అలసటతో వాలిపోతాడు. మహివిష్ణువును లేపేందుకు ఓ కీటకాన్ని పంపుతారు. కీటకం తాడును కొరకగానే పొరపాటున వింటిని ఉన్న బాణం తగిలి విష్ణువు తల ఎగిరిపోతుంది. దేవీ అనుగ్రహంతో గుర్రం తలను తెచ్చి విష్ణుమూర్తి శరీరానికి అతికించగా విష్ణుమూర్తి హయగ్రీవుడి రూపంలో ఆ రాక్షసుని సంహరిస్తాడు. శ్రావణపౌర్ణమి రోజున హయగ్రీవ జయంతి జరుపుకుంటారు.

రాఖీ రోజు ఉద‌యాన్నే తల స్నానం చేసి, నూతన బ‌ట్ట‌లు వేసుకుని, అక్క‌చెల్లెళ్లంతా అన్న‌ద‌మ్ములకి రాఖీని క‌డ‌తారు. రాఖీని క‌ట్టేట‌ప్ప‌డు ‘‘యేన బద్ధో బలీరాజా దానవేంద్రో మహాబలః తేన త్వామభి బధ్నామి రక్షమాచల మాచల’ అనే స్తోత్రాన్ని కూడా చ‌దువుతారు. ‘ఎలాగైతే ఆ విష్ణుమూర్తి, బ‌లిచక్ర‌వ‌ర్తిని బంధించాడో, నువ్వు అలాగే ఇత‌ణ్ని అన్ని కాలాల‌లోనూ విడ‌వ‌కుండా ఉండు’ అని దీని అర్థం. ఆ త‌రువాత హార‌తిని ఇచ్చి, నుదుట‌ తిల‌కాన్ని దిద్దుతారు.