Ram Ramapati Bank : ఆ ‘బ్యాంక్‌లో శ్రీరామ నామాలే డిపాజిట్లు’ .. ఆ చెట్టుతో చేసిన పెన్నుతో రామనామాలు రాయాలట,రాముడి బ్యాంకు పూర్తి విశేషాలు

శ్రీరామ నామాలli డిపాజిట్లుగా జమ చేసుకునే బ్యాంకు. డబ్బులతో పనిలేదు. రాముడి నామాలతోనే సంబంధం. రామ నామాలు డిపాజిట్ చేస్తే..కోరిన కోరికలు రాముడు తీరుస్తాడట..

Ram Ramapati Bank : బ్యాంకులు అంటే డబ్బులు దాచుకుంటాం. వాటిని తీసి వాడుకుంటుంటాం. నగదు డిపాజిట్లు చేస్తుంటాం. ఇలా నగదు లావాదేవీలు బ్యాంకుల్లో జరుగుతుంటాయి. కానీ ఉత్తరప్రదేశ్ లోని వారణాశిలోని ఓ బ్యాంకుకు డబ్బులతో పనిలేదు. ఆధ్యాత్మికతతోనే సంబంధం. ఆధ్యాత్మిక బ్యాంకుగా పేరొందిన ఆ బ్యాంకులో ‘శ్రీరామ నామాలను’డిపాజిట్లుగా జమ చేసుకుంటారు. రామ నామాలు రాసి వాటిని ఏ దేవాలయంలోనే సమర్పిస్తారు భక్తులు. కానీ వారణాశిలో ఉన్న ‘‘రామ్‌ రమాపతి బ్యాంక్‌’’మాత్రం పూర్తి ఆధ్మాత్మికత వెల్లివిరిసే బ్యాంకు..అసలు ఇటువంటి ఓ బ్యాంకు ఉందని చాలామందికి బహుశా తెలియకపోవచ్చు. వారణాశి వెళ్లినవారికి కూడా తెలిసి ఉండదు.

శ్రీరాముడి పేరుతో ఏర్పాటై.. రామ నామాలను డిపాజిట్లుగా తీసుకునే బ్యాంకు గురించి మీకు తెలుసా? అని అడిగితే చాలామంది తెలియదనే చెబుతారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసిలో ఉన్న ఆధ్మాత్మికత బ్యాంకు ‘‘రామ్‌ రమాపతి బ్యాంక్‌’’ గురించి వివరాలు..విశేషాలు గురించి చెప్పాలంటే అన్నీ ఇన్నీ కావు..ఇక్కడ శ్రీరామ నామాలను డిపాజిట్లుగా తీసుకోవటమే కాదు..ఈ బ్యాంకులో రామ నామాలను డిపాజిట్ చేయాలంటే ఆ రామ నామాలు మన ఇష్టానుసారంగా రాయటానికి వీల్లేదు. బ్యాంకు వారు సూచించిన అన్ని నిబందనలు పాటించాలి. భక్తిశ్రద్ధలతో రాయాలి. అంతేకాదు రామనామాలు రాయటానికి బ్యాంకు వారే ఓ ప్రత్యేక పెన్నుని కూడా ఇస్తారు. ఆ పెన్ను ఓ ప్రత్యేకమైన చెట్టుతో తయారు చేసిన పెన్ను..అలా రామనామాలు రాయటం..ఈ బ్యాంకు విశేషాలు తెలుసుకుని తీరాల్సిందేనంటారు భక్తులు..అవేంటో తెలుసుకుందాం..

వారణాసిలో ఉన్న ఈ ‘‘రామ్‌ రమాపతి బ్యాంక్‌’’లో ఇప్పటికే 1,942.34 కోట్ల రామ నామాలు ఉన్నాయంటే ఈ బ్యాంకుకు ఉన్న ప్రత్యేకత ఏంటో ఊహించుకోవచ్చు. త్రిపుర భైరవి ప్రాంతంలోని మీర్‌ఘాట్‌లో ‘‘రామ్‌ రమాపతి బ్యాంక్‌’’ ఉంది. ఈ బ్యాంకుని మెహ్రోత్రా కుటుంబం గత 96 ఏళ్లుగా నిర్వహిస్తోంది. ఈ బ్యాంకు మేనేజర్ గా ఆ కుటుంబానికి చెందిన సుమిత్ మెహ్రోత్రా ఉన్నారు. శ్రీరామ నవమి పండుగ సందర్భంగా ఎంతోమంది భక్తులు ఈ బ్యాంకుకు వచ్చి ఎకౌంట్స్ ఓపెన్ చేస్తారు. బ్యాంకు నిబంధనల ప్రకారం రామనామాలు రాసి డిపాజిట్ చేస్తుంటారు. ‘‘రామ్‌ రమాపతి బ్యాంక్‌’’ ఇతర బ్యాంకుల వలె కాదని ఇక్కడ ఎటువంటి నగదు,నగల లావాదేవీలు ఉండవని మేనేజర్ సుమిత్ మెహ్రోత్రా తెలిపారు. ఈ బ్యాంకులో దివంగత ప్రధాని లాలా బహదూర్ శాస్త్రి తల్లి డిపాజిట్ తీసుకున్నారని తెలిపారు. అలాగే బాలివుడ్ నటుడు శత్రుఘ్న సిన్హా కుటుంబ సభ్యులు కూడా ఈ బ్యాంకు నుంచి డిపాజిట్లు తీసుకున్నారని తెలిపారు.

Golden Ramayanam : 19 కిలోల బంగారంతో తయారు చేసిన 530 పేజీల రామాయణం ..!

ఈ బ్యాంకులో రాముడి పేరుతో రుణం కూడా ఇస్తారు. ఆ రుణం 8 నెలల 10రోజుల్లోగా తిరిగి చెల్లించారు. ఇక్కడ రుణం అంటే ఎకౌంట్ ఓపెన్ చేసి రామ నామాలను చెల్లించాలన్నమాట. ఈ ‘‘ఆధ్మాత్మిక బ్యాంక్‌’’ గురించి మేనేజర్ మోహ్రోత్రా వంశస్థుడు అయిన సుమిత్ మెహ్రోత్ వివరిస్తూ.. ఈ ‘‘రామ్‌ రమాపతి బ్యాంక్‌’’ 1926లో మా తాతకు తాతైన దాస్‌ చన్నూలాల్‌ ప్రారంభిచారని..ఇది డబ్బులతో పని లేని ఆధ్యాత్మిక బ్యాంకు’’ అని తెలిపారు. ఇక్కడ ఖాతాలు ప్రారంభించేవారికి ‘‘కిల్విష్‌ చెట్టు’’ నుంచి తయారుచేసిన కలం (Pen), అంటే చెక్క పెన్ను ఇస్తారు. దాంతోనే రామ నామం రాయడానికి బ్యాంకు వారు ఇచ్చిన కాగితంపై రాయాలి. అదీకూడా బ్రహ్మ ముహూర్తంలో అంటే.. ఉదయం నాలుగు గంటల నుంచి 7 గంటల వరకు మాత్రమే ‘రామ నామాలు’రాయాలి. ఎర్రటి ఇంకును బ్యాంకువారే ఇస్తారు. దాంతోనే రాయాలి. రామనామాల పూర్తి చేసే ప్రక్రియ 8నెలల 10 రోజుల్లో పూర్తి చేసి బ్యాంకుకు అందజేయాలి. ఒక్కొక్కరు లక్షా 25 వేల రామ నామాలు రాసి మళ్లీ ఈ బ్యాంకులో జమ చేయాలి. అవి సదరు వ్యక్తి ఖాతాలో జయ చేయబడతాయి.

దీని కోసం ఖాతాదారులకు 250 రోజుల సమయం ఇస్తాం. రామ నామాలు రాస్తున్న సమయంలో నిబంధనలు పాటించారు. ఉల్లి, వెల్లుల్లి వేసిన ఆహారంతోపాటు బయట తయారు చేసిన ఎటువంటి ఆహారం తినకూడదనే నియమం ఉంది. మాంసాహారం అస్సులు ముట్టుకూడదు. ఇలా నియమ నిబంధనలు పాటించి రామనామం రుణం తీర్చుకుంటే భక్తులు కోరిన కోరికలు నెరవేరతాయని భక్తుల నమ్మతారు. ఈ బ్యాంకకు భారతీయులే కాక కెనడా, అమెరికా, ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్‌, జపాన్‌ దేశాల నుంచి కూడా వచ్చి ఖాతాలు తెరుస్తున్నారు.

‘‘రామ్‌ రమాపతి బ్యాంక్‌’’ గురించి మీరాదేవి అనే భక్తులు మాట్లాడుతూ..మా అమ్మ ఈ బ్యాంకులో అప్పు తీసుకుని రామ నామాలు రాసి జమచేస్తే నేను పుట్టానని అమ్మ చెప్పేది. అలా నేను కూడా ఇక్కడ అకౌంట్ ఓపెన్ చేసి అప్పు తీసుకుని పూర్తి చేశా..రాముడు నాకు చాలా ఇచ్చాడని అని తెలిపారు. నేను నాలుగు సార్లు పూర్తి చేశా..నా కోరికలు అన్నీ తీరాయి అని తెలిపారు. నేను మళ్లీ మళ్లీ రామనామాలు రాయాలనుకుంటున్నానని తెలిపారు.

 

ట్రెండింగ్ వార్తలు